Yash: దేశ వ్యాప్తంగా ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను సైతం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు రూ. 1167 కోట్ల మేర కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ‘‘ హొంబలే ఫిల్మ్’’ కలెక్షన్ల గురించి ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో యశ్‌ను బాక్సాఫీస్ సుల్తాన్‌గా పేర్కొంది. దీంతో కన్నడ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. కన్నడ హీరో దర్శన్ ఫ్యాన్స్ ‘‘బాక్సాఫీస్ సుల్తాన్’’ టైటిల్ కోసం ట్విటర్ వేదికగా యుద్దమే చేస్తున్నారు. వీరికి మిగిలిన కన్నడ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ‘‘బాక్సాఫీస్ సుల్తాన్’’ అన్న టైటిల్ తమ హీరోకు మాత్రమే సొంతమని దర్శన్ ప్యాన్స్ పేర్కొంటున్నారు. ఒక్క సినిమాకే యశ్‌ను బాక్సాఫీస్ సుల్తాన్‌ను చేయటం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
తమ హీరో టైటిల్‌ను దొంగిలించిన యశ్ ఒక దొంగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు! #TitleStealingStarYashను ట్విటర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. యశ్ ఫ్యాన్స్ కూడా దీనికి తగ్గట్టుగా సమాధానం ఇస్తున్నారు. తమ హీరోపై బ్యాడ్ కామెంట్లు చేస్తే ఊరుకోమంటున్నారు. కాగా, దర్శన్ కన్నడలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు. ఈయన సినిమాలు అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే దర్శన్‌కు 2014లో బాక్సాఫీస్ సుల్తాన్‌గా అభిమానులు పట్టం కట్టారు. మరి, ఈ ఫ్యాన్స్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Calling One movie wonder Yash as Box office sulthan is same as calling Riyag Parag as Best finisher for 1 innings in entire season😆#TitleStealingStarYash#CunningProductionHombaleFilms#DBoss #Kranti pic.twitter.com/JxsNMDbh0A
— King Kariya (@KingKariyaa) May 10, 2022
Box Office Sultantitled in 2014 only,now how can you people use that tittle,I donno whether this bothers you or not bt it always bothers the true fans of #DBoss @dasadarshan before getting trolled remove that caption#TitleStealingStarYash#CunningProductionHombaleFilms pic.twitter.com/x9Q8A4XMxy
— 𝐍𝐀𝐕𝐀𝐆𝐑𝐀𝐇𝐀 (@DBOSS_Brand) May 10, 2022
original is original
Box office sulthan n dboss belongs to darshan
No doubt kgf team has done impossible to possible for KFI
But y take other hero title
Ig producer Karthik gowda is behind this 😂#TitleStealingStarYash#CunningProductionHombaleFilms pic.twitter.com/No3JCPHGqf— deepika / ದೀಪಿಕಾ (@deepika45638) May 10, 2022
The only Box office SULTAN we know @dasadarshan 🔥#TitleStealingStarYash#CunningProductionHombaleFilms#DBoss #Kranti pic.twitter.com/iFOJLnm2FV
— DBoss 88 (@bossmania88) May 10, 2022
ఇవి కూడా చదవండి : Yash: కొడుకు, కూతురుతో యష్ ఫన్నీ వీడియో.. నెట్టింట వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.