‘పటాస్’ షో ద్వారా ఇంట్రడ్యూస్ అయిన యాదమ్మ రాజు తనదైన కామెడీతో అందరినీ అలరిస్తుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ.. పంచ్ డైలాగ్స్‌తో అందరినీ తెగ నవ్వించేవాడు. బుల్లితెరపైనే కాదు, వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ‘జబర్ధస్త్’ లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు.
‘పటాస్’ షో ద్వారా ఇంట్రడ్యూస్ అయిన యాదమ్మ రాజు తనదైన కామెడీతో అందరినీ అలరిస్తుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ.. పంచ్ డైలాగ్స్‌తో అందరినీ తెగ నవ్వించేవాడు. బుల్లితెరపైనే కాదు, వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ‘జబర్ధస్త్’ లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. అయితే ఇటీవల హాస్పిటల్ బెడ్ మీద కాలికి కట్టుతో కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అసలు యాదమ్మ రాజుకి ఏం జరిగిందని అందరూ షాక్ అయ్యారు. అతనికి యాక్సిడెంట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొంది. రీసెంట్‌గా యాదమ్మ రాజు తనకు ప్రమాదం ఎలా జరిగింది?, ఏంటి అనే వివరాలు తెలియజేశాడు.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా.. శ్రీధర్ దర్శకత్వం వహించిన మూవీ ‘స్లమ్‌డాగ్ హస్బండ్’. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో యాదమ్మ రాజు, హీరో ఫ్రెండ్ సంతోష్ క్యారెక్టర్ చేశాడు. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ప్రమాదానికి గురైనా కానీ కాలికి కట్టుతోనే సుమన్ టీవీ ఇంటర్వూలో పాల్గొన్నాడు రాజు. తనకు జరిగిన ప్రమాదం గురించి వివరించాడు. తన తప్పు లేకపోయినా యాక్సిడెంట్‌కి గురయ్యానని.. కాలికి ఒక వేలు తీసేసి సర్జరీ చేశారని చెప్పుకొచ్చాడు.
‘కాలు బాగోకపోయినా ప్రమోషన్స్‌కి వచ్చావ్. నీకు సినిమా అంటే ఎంతిష్టమో అర్థమవుతుంది. త్వరగా కోలుకుని, మంచి క్యారెక్టర్లతో మమ్మల్ని ఎంటర్‌టైన్ చెయ్యాలి. నువ్వు బాగుండాలి భయ్యా’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘స్లమ్‌డాగ్ హస్బండ్’ మూవీలో హీరో స్నేహితుడిగా యాదమ్మ రాజుకి మంచి క్యారెక్టర్ పడింది. తన సలహా వల్లే హీరో కుక్కని పెళ్లి చేసుకుంటాడు. సరదాగా సాగిపోతున్న కథ కాస్తా రాజు సలహా ఇచ్చిన దగ్గరి నుంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యాదమ్మ రాజు.