అహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహాం బాలయ్య ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. అసలు బాలకృష్ణ యాంకర్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన వల్ల కాదు అని కూడా అన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అన్‌స్టాపబుల్ షోని టాక్ షోలకి బాప్ షోగా మార్చారు. బాలయ్యకే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో.. అన్‌స్టాపబుల్‌ని టాప్ షోగా నిలబెట్టారు. ఫస్ట్ సీజన్ సాధించిన భారీ విజయంతో.. రెండో సీజన్‌ని ప్రారంభించారు. ఈ సీజన్‌కి కాస్త పొలిటికల్ టచ్ యాడ్ చేశారు. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌కి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌లను గెస్ట్‌లుగా పిలిచారు. మిలియన్ల వ్యూస్‌తో ఈ ఎపిసోడ్ రికార్డు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 2కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం అవుతోంది. ఇప్పటి వరకు సీజన్ 2కి చంద్రబాబు నాయడు, లోకేష్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, తాజాగా ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కి శర్వానంద్, అడవి శేష్ గెస్ట్‌లుగా రానున్నారు. ఇక తర్వాత ఎపిసోడ్‌కి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గెస్ట్‌గా రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి.. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆమె టీవీల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది. దీని ప్రకారం చూసుకుంటే.. షర్మిల బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చే అవకాశాలు అధికంగానే ఉన్నాయి అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక షర్మిల నిజంగానే అన్‌స్టాపబుల్ షోకి వస్తే.. ఆ ఎపిసోడ్ చంద్రబాబు వచ్చిన ఎపిసోడ్‌కి మించి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏపీ సీఎం జగన్ సోదరి కావడంతో.. వైఎస్ షర్మిలను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తారు.. ఏయే అంశాలను ఈ టాక్ షోలో టచ్ చేస్తారన్న విషయాలు ఆసక్తికరంగా మారతాయంటున్నారు నెటిజనులు. మరి ఈ వార్తలు ఎంత వరకు వాస్తవమో చూడాలి.