తెలుగులో బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సక్సెస్ ఫుల్ గా ఐదు సీజన్ లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్-5 కొంత మందిని హీరోలని చేస్తే మరి కొంత మందిని జీరోలని చేసింది. ఈ సీజన్-5 కారణంగా ప్రేమ జంటలు బ్రేకప్ చెప్పుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దీప్తి సునయన, షన్నుల ప్రేమ కథకు బిగ్ బాస్ షో కారణంగానే ఎండ్ కార్డ్ పడిందని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ పూర్తి కాగానే షన్నుకు దీప్తి బ్రేకప్ చెప్పేసింది. సోషల్ మీడియా వేదికగా దీప్తి పెట్టిన బ్రేకప్ పోస్ట్ వైరల్‌గా మారి నెట్టింట చర్చనీయాంశం అయిన విషయం అందరికి తెలిసిందే.
గత కొన్నేళ్లుగా ప్రేమలో వున్న దీప్తి, షన్ను బిగ్ బాస్ కారణంగా విడిపోవాల్సి వచ్చింది. షో ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వీరిద్దరి మధ్య పెరిగిన దూరం తగ్గలేదు. వీళ్లు మళ్లీ కలుస్తారని షన్ను తండ్రి ప్రకటించినాడు. కానీ అందుకు తగ్గట్లు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. షన్నుని ఉద్దేశించి దీప్తి పెట్టిన పోస్ట్ లు వీరి మధ్య మరింత దూరాన్ని పెంచేవిగా ఉన్నాయి కానీ తగ్గించేవిగా లేవు. దీంతో అందరి చూపు ఇప్పడు ఫిబ్రవరి 14 పై పడింది.
దీప్తి మనస్సు కరిగి మళ్లీ వారిద్దరు కలుస్తారేమో అని.. అందరూ ఎదురు చూస్తున్నారు. షన్ను మాత్రం `మై లవ్ ఈజ్ గాన్..’ అనే పాటకు స్టెప్పులేసి ఆ వీడియోని నెట్టింట షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వాలంటైన్స్ డే(ఫిబ్రవరి 14) రోజున అయినా వీళ్లు కలుస్తారా? లేదా షన్నూ చేసిన పిచ్చి పనుల కారణంగా శాశ్వతంగా విడిపోతారా అనే అనుమానాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.