బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన సంగతి తెలిసిందే. సోమవారం నాడు హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది.. మంగళవారం నాడు కొన్ని టాస్క్ లతో హౌస్ మేట్స్ తో ఆడించారు. ఆ తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ‘శక్తి చూపరా డింభకా’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం.. ఉరుముల శబ్దం వచ్చిన ప్రతీసారి హౌస్ మేట్స్ పవర్ రూమ్ దగ్గర ఉన్న పవర్ స్కాన్ మీద చేయి పెట్టాల్సి ఉంటుంది. పవర్ స్కాన్ గ్రీన్ కలర్ లోకి రావాలి. అప్పుడు వాళ్లకు పవర్ రూమ్ యాక్సెస్ వస్తుంది. ఎక్కువ సార్లు పవర్ రూమ్ దగ్గరకు వెళ్లిన వాళ్లకు కెప్టెన్సీ పొందడానికి అవకాశం ఉంటుంది.
సాధారణంగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటుంటారు. కొంత మంది తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని.. హౌజ్ లో ఏదైనా అవమానం జరిగితే వెంటనే ఏడ్చేస్తుంటారు. గత సీజన్లలో తమ కన్నీటితో బిగ్ బాస్ హౌస్‌కి సంద్రంగా మార్చేసిన సింగర్ మధుప్రియ, శివజ్యోతి, మొనాల్ గుజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వంట బాగుందని చెప్పడానికి ఏడుపు.. కోపం వస్తే.. బాధ వస్తే ఏడుపు.. తిట్టుకుంటే ఏడుపు.. కొట్టుకుంటే ఏడుపు దరిద్రం ఏంటేంటే గట్టిగా పొగిడినా కూడా ఆనంద భాష్పాలతో ఏడుపు.. ఇలా ఏడవడానికే వచ్చినట్టు చేస్తుంటారు కొంత మంది ఇంటి సభ్యులు. బిగ్ బాస్ సీజన్ 4 లో మొనల్ గుజ్జర్ దాదాపు ఏడవని ఎపిసోడ్ అంటూ ఉండదేమో అనిపించేలా ఉంటుంది.
బోరు బోరున ఏడుస్తూ బిగ్ బాస్ కన్నీటి ట్యాప్‌ని ఓపెన్ చేసే ఉంచుతోంది. ఈమె ఏడుపు చూసి పంపు కాదు పాతాల గంగ మొనాల్ గుజ్జర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేసేవారు. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 మొన్న ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా మొదలైంది. ఈసారి 19 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్ లో హీరోయిన్ లహరి షారీకి ఆర్జే కాజల్‌కు మధ్య భారీగా వాగ్వాదం చోటుచేసుకొన్నది. కిచెన్ రూమ్ లో ఎవరూ సరిగ్గా పని చేయడం లేదని ప్లాన్ చేసుకొని చేద్దామని కాజల్ ఇనీషియేట్ చేసింది. ఇది లహరికి నచ్చలేదు.
కాజల్ తననే పెర్సనల్ గా టార్గెట్ చేస్తుందని కాజల్ పై మండిపడింది. తనపై ఎటాక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. నేను ఎటాక్ చేస్తున్నానా? అని కాజల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అవును డెఫినెట్‌గా ఎటాక్ చేస్తున్నావు అని లహరి అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది. మొత్తాని వీరి మద్య జరిగిన గొడవలో కాజల్ కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత నా కూతురు చూస్తే ఏడుస్తుంది అంటూ కాజల్ అక్కడి నుంచి కళ్ల నీళ్లను తుడుచుకొంటూ వెళ్లింది. అయితే ఆర్జే కాజల్ సున్నితమైన మనస్థత్వంగా ఉందని.. ఆమె కూడా ప్రతి విషయానికి భావోద్వేగానికి గురి అవుతుందా? మరో మొనాల్ గుజ్జర్ కాబోతుందా అని నెటిజన్లు ముచ్చుటించుకుంటున్నారు.