ప్రస్తుతం ఇండియన్ సినిమాలన్నీ గ్లోబల్ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రీజియన్ స్టార్స్ అంతా పాన్ ఇండియా స్టార్స్ గా.. ఆ తర్వాత హాలీవుడ్ లో సినిమాలు చేసి గ్లోబల్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇండియా నుండి గ్లోబల్ స్టార్డమ్ ని సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్డమ్ అందుకున్న ఈ బోల్డ్ బ్యూటీ.. కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. అడపాదడపా చేస్తున్నప్పటికీ, ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలే చేస్తోంది. పైగా తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఇంగ్లీష్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లాడింది. వీరి కూతురిని రీసెంట్ గా ఫ్యాన్స్ కి చూపించింది.
ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇండియాకి వచ్చింది ప్రియాంక. పాప పుట్టాక తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించిన ప్రియాంక.. ఇప్పుడు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందట. అయితే.. ఈసారి సౌత్ పై హీరోలతో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తోందట. ఇక ప్రియాంక సెకండ్ ఇన్నింగ్స్ కి సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రియాంక చోప్రా తెలుగు హీరోతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుందట. బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ సరసన డెబ్యూ చేయనుందని టాక్.
పుష్ప 2, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలతో పాటు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ సాలిడ్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి.. స్పిరిట్ సినిమాలో ప్రియాంకని తీసుకునే ఆలోచన చేస్తున్నాడని రూమర్స్ నడుస్తున్నాయి. అయితే.. ఇదివరకే ప్రియాంక రామ్ చరణ్ సరసన ‘జంజీర్’ మూవీ చేసింది. కానీ.. అది హిందీ కాబట్టి, ఇప్పుడు డైరెక్ట్ సాలిడ్ మూవీతో టాలీవుడ్ కి రెడీ అవుతోందట. ఇప్పటికే దీపికా పదుకొనే, కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ లాంటి ఫామ్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో బిజీ అవుతున్నారు. మరి ప్రియాంక కూడా వీరి జాబితాలో చేరుతుందేమో చూడాలి! మరి ప్రభాస్ తో ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Exclusive
According to sources director #SandeepReddyVanga looks to rope in #PriyankaChopra opposite #Prabhas in #Spirit, the director believes that the actreses presence in the movie can positively boost the movies hype in international versions pic.twitter.com/xm6rxwPtl8— Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) January 1, 2023