డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మాఫియా యాక్షన్ డ్రామా సలార్, మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే.. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మిగతా సినిమాలతో పాటు ఆదిపురుష్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతోంది. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ కి విదేశాల((జపాన్, తైవాన్, చైనా, మలేషియా, ఇండోనేషియా)లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఆదిపురుష్ ని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఆదిపురుష్ ఇంగ్లీష్ వెర్షన్ హాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రముఖ ‘డిస్నీ’ స్టూడియోస్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకవేళ డిస్నీ వారితో డీల్ ఓకే అయితే మాత్రం ఆదిపురుష్ సినిమా మరోస్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కోసం ఇరవై వేల థియేటర్లు ఓకే చేశారని.. హాలీవుడ్ యాడ్ అయితే ఇంకా థియేటర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు కాబట్టి.. రాబోవు సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు కూడా పాన్ వరల్డ్ స్థాయిలోనే రిలీజ్ అవుతాయేమో చూడాలి. మరి డార్లింగ్ పాన్ వరల్డ్ క్రేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.