Nithin: సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న హీరోలు ఒక్కసారిగా టీవీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా కంగారు పడిపోవడం మామూలే. సాధారణంగా సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్న హీరోలు.. సీరియల్స్ లో కనిపించబోతున్నారు అంటే.. ఊహించుకోవడానికే ఫ్యాన్స్ కి కష్టం అనిపించవచ్చు. అలాంటిది ఒక్క సీరియల్ కాదు.. చాలా సీరియల్స్ లో హీరో దర్శనమివ్వడం అనేది చాలా పెద్ద విషయంగానే భావిస్తుంటారు.
తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ త్వరలోనే తెలుగు టీవీ సీరియల్స్ లో దర్శనమివ్వనున్నాడని సినీవర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు సైతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో నితిన్ టీవీ సీరియల్స్‌లో నటించబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే.. నిజంగానే నితిన్ సీరియల్స్ లోకి రానున్నాడా? అంటే.. అదంతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని సమాచారం.
తాజా అప్డేట్ ప్రకారం.. పలు పాపులర్ టీవీ సీరియల్స్ లో నితిన్ అతిథి పాత్రలో కనిపించి, మాచెర్ల నియోజకవర్గం మూవీని ప్రమోట్ చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. మరి నితిన్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.