ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు విన్న తర్వాత జనాల్లో బిగ్ బాస్ షో ఇంకా కంటిన్యూ అవుతుందా? ఆగిపోనుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు యువత పెడదారి పడుతోందని ధర్మాసనం తెలిపింది. బిగ్ బాస్ లాంటి షోలతో సమాజంలో, యువతలో ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది.
ఇటువంటి అభ్యంతరకరమైన టీవీ షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. అలాగే బిగ్ బాస్ షోను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ షో.. రానురాను బూతుగా మారుతోందని, అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మూడేళ్ళ కిందటే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మానసం స్పందించి.. మంచి వ్యాజ్యం వేశారంటూ కేతిరెడ్డిని ప్రశంసించింది. ఇలాంటి షోలతో మనకేం పని అంటూ జనాలు భావిస్తున్నారు.
సమాజంలో ఇలాంటి విషయాలను పట్టించుకోకపోతే.. భవిష్యత్తులో సమస్యలను ఇతరులు పట్టించుకోరని ధర్మాసనం కీలకవ్యాఖ్యలు చేసింది. ఇక సంబంధిత వ్యాజ్యంపై సోమవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఇకపై బిగ్ బాస్ షో కంటిన్యూ అవుతుందా లేదా అనేది సోమవారం తెలియనుంది. మరి బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.