టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొడుకు అకిరా నందన్ తో కలిసి నటిస్తాడనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సుజీత్ దర్శకత్వంలో OG సినిమాతో వీరిద్దరి ఎంట్రీ ఖాయమంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజం, అసలు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
సినిమాలో తన అభిమాన హీరో కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇక ఈ మధ్య మల్టీ స్టారర్ లు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా మనకు తెలిసిందే ఇందులో పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక సరికొత్త కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొడుకు అకిరా నందన్ తో కలిసి నటిస్తాడనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సుజీత్ దర్శకత్వంలో OG సినిమాతో వీరిద్దరి ఎంట్రీ ఖాయమంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజం, అసలు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ తీసుకురావడంలో మొదటి వరుసలో ఉంటాడు. ప్రస్తుతం పవర్ స్టార్ వరుస బెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో OG అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబై లో జరగగా.. ప్రస్తుతం మహాబలేశ్వరంలో జరిగే సెకండ్ షెడ్యూల్ లో పవన్ చేరనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.
స్టోరీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి మాఫియా డాన్ పాత్ర కాగా, మరొకటి కాలేజ్ లెక్చరర్ రోల్. ఇక టీనేజ్ కుర్రాడిగా కూడా సందడి చేయనున్నాడు. అయితే ఈ రోల్ కోసం డైరెక్టర్ సుజీత్.. అకిరా నందన్ ని నటింప చేయాలనుకుంటున్నాడట. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కి త్వరలో చెప్పనున్నాడని సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం అకిరా నందన్ ది ఇదే డెబ్యూ మూవీ అవుతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో హరి హరన్ వేరే మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు కూడా చేస్తున్నాడు. మొత్తానికి కొడుకు అకిరా నందన్ కి ఈ మూవీ ద్వారా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి