సాధారణంగా సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు.. ఆ సినిమా తాలూకు హైలైట్స్ అన్నీ ఒకసారి అలా మైండ్ లో వచ్చి వెళ్తుంటాయి. వాటిలో మూవీలోని హై మూమెంట్స్ ఉండవచ్చు లేదా ఏవైనా క్యారెక్టర్స్ కూడా ఉండవచ్చు. అలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులను చాలా సర్ప్రైజ్ చేస్తుంటాయి. విశ్వనటుడు కమల్ హాసన్ – దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. ఈ సినిమాలో ఎన్ని హైలైట్స్ ఉన్నా.. ఏజెంట్ టీనాని ఎవరు మర్చిపోలేరు. అదీగాక ఆ క్యారెక్టర్ పోషించిన ఆమెకు విక్రమ్ మూవీనే డెబ్యూ అంటే మీరు నమ్మగలరా? కానీ.. నమ్మి తీరాలి. ఏజెంట్ టీనా క్యారెక్టర్ లో నటించిన నటి పేరు ‘వాసంతి’.
కోలీవుడ్ లో దాదాపు ముప్పై ఏళ్లుగా వర్క్ చేస్తోంది వాసంతి. కానీ.. 2022లో విడుదలైన విక్రమ్ మూవీనే ఆమెకు డెబ్యూ. అదెలా సాధ్యం అని మీకు అనిపించవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. వాసంతి వృత్తిపరంగా క్లాసికల్ డాన్సర్, డాన్స్ టీచర్. ముప్పై ఏళ్లుగా ఆమె డాన్స్ లో పాఠాలు చెబుతూ.. కొన్నాళ్లుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేస్తోంది. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాలోని ‘వాతి కమింగ్’ సాంగ్ లో కూడా వాసంతి మెరిసింది. అదే టైంలో ఆమె ఎనర్జీని గమనించిన డైరెక్టర్ లోకేష్.. తాను నెక్స్ట్ తీసిన విక్రమ్ లో ‘ఏజెంట్ టీనా’ క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు.
ఆ విధంగా డాన్సర్ వాసంతి కాస్త నటి ఏజెంట్ టీనాగా పాపులర్ అయ్యింది. డెబ్యూ మూవీనే మంచి పేరు తెచ్చేసరికి.. ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ళ తర్వాత తనను జనాలు డాన్సర్ గా కాకుండా ఏజెంట్ టీనాగా గుర్తించారని ఆమె చెప్పింది. కాగా.. విక్రమ్ లో పవర్ ఫుల్ టీనా క్యారెక్టర్ లో పెర్ఫార్మన్స్ అదరగొట్టి.. సర్ప్రైజ్ చేసిన ఏజెంట్ టీనా క్యారెక్టర్.. ఇప్పుడు లోకేష్ తెరకెక్కిస్తున్న దళపతి67 లో కూడా కంటిన్యూ అవుతోందని తెలుస్తోంది. తాజాగా విజయ్ – లోకేష్ మూవీకి ‘లియో; బ్లడీ స్వీట్’ అని టైటిల్ అనౌన్స్ చేశారు. అదీగాక ఇటీవల షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో టీనా క్యారెక్టర్ ఉందంటూ ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిక్ ప్రకారం వాసంతి షూటింగ్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. సో.. ఏజెంట్ టీనా ఉంది కాబట్టి.. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఏజెంట్ టీనా పిక్ వైరల్ గా మారింది. మరి లోకేశ్ యూనివర్స్ పై, ఏజెంట్ టీనా క్యారెక్టర్ పై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.