ఈ మధ్యకాలంలో సినిమాలతో సంబంధం ఉన్నా, లేకున్నా ట్రోల్స్ ఫేస్ చేస్తున్న హీరోలలో మంచు విష్ణు ఒకరు. హీరోగా, మా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న విష్ణు.. సినిమా వార్తలకంటే ఎక్కువగా ట్రోల్స్ ద్వారానే వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘జిన్నా‘. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా.. కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అదీగాక జిన్నా మొదటి రోజు కలెక్షన్స్ ని, మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ కలెక్షన్స్ తో పోల్చడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో మంచు విష్ణు ఆల్రెడీ ఇదివరకు చెప్పినట్లుగానే తనను, తన సినిమాలను ఓ హీరో దగ్గరుండి ట్రోల్ చేస్తున్నాడని చెప్పాడు. తనపై వస్తున్న ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ వచ్చాడు. అయితే.. ఇప్పుడు జిన్నా విషయంలో కూడా సదరు ట్రోలర్స్ గ్యాంగ్ పనిగట్టుకొని ఇలా ట్రోల్ చేస్తున్నారని, పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాను కూడా ట్రోలింగ్ తో ఆపేయాలని చూడటం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా మంచు విష్ణు చాలా మంచి వ్యక్తి. గతంలో ఏదో అన్నాడని అప్పటినుండి ట్రోల్ చేస్తూ వస్తున్నారు. కానీ.. ట్రోల్స్ అనేవి తనపై చేస్తే ఎంజాయ్ చేస్తానని చెప్పిన విష్ణు.. తన వాళ్ళ జోలికి, సినిమాల జోలికి వస్తే ఊరుకోనని కూడా చెప్పాడు.
ఇదిలా ఉండగా.. విష్ణు కెరీర్ లో ఢీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ప్లాప్స్ పడినా మధ్యలో దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి యావరేజ్ హిట్స్ పడ్డాయి. ఆ సినిమాల తర్వాత మళ్లీ వరుసగా ప్లాప్స్ వచ్చాయి. కానీ.. మొన్నటివరకూ ప్లాప్ అయిన సినిమాలతో పోల్చితే మంచు విష్ణు కెరీర్ లో జిన్నా మంచి చిత్రంగా టాక్ తెచ్చుకుంది. అలాంటి సినిమాను ట్రోల్స్ తో తొక్కేయాలని చూడటం ఏమాత్రం సమంజసం కాదని.. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించినట్లే, కామెడీ హారర్ చిత్రంగా జిన్నాను ఎంజాయ్ చేయొచ్చని పాజిటివ్ టాక్ ఉంది. సో.. మంచు విష్ణు చెప్పినట్లుగా తనపై ఉన్న పర్సనల్ పగల వల్లే ఇలా సినిమాను కూడా కుట్రపూరితంగా ట్రోల్ చేస్తున్నారని సినీవర్గాల సమాచారం. చూడాలి మరి విష్ణు జిన్నా మూవీ ట్రోల్స్ పై ఏమైనా స్పందిస్తాడేమో!