తెలుగు బుల్లితెర చరిత్రలో చాలానే డాన్స్ షోలు వచ్చాయి. కానీ.., వాటిల్లో ఢీ డ్యాన్స్ షో సృష్టించిన రికార్డ్స్ మాత్రం ప్రత్యేకం. ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇంటెర్నేషనల్ స్థాయికి తగ్గకుండా ఉంటాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇంత మంచి అవుట్ ఫుట్ ఉంటుంది కాబట్టే ఢీ.. పుష్కర కాలంగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే.., ఢీ పోగ్రామ్ కి జడ్జెస్ రావడం, పోవడం చాలా సర్వ సాధారణంగా జరిగేదే. కానీ.., ఈమధ్య కాలంలో ఢీ షోకి జడ్జ్ గా శేఖర్ మాస్టర్ సూపర్బ్ గా సూట్ అయ్యాడు.
ఒకవైపు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూనే.., మరోవైపు ఢీ లాంటి డ్యాన్స్ షోని ఆయన ముందుండి నడిపించాడు. ఒకానొక సమయంలో శేఖర్ మాస్టర్ కోసమే ఢీ షోని చూసే ప్రేక్షకులు పుట్టుకొచ్చారు. కట్ చేస్తే.. ఈ మధ్య ఢీ షోలో శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు. అయన స్థానంలో గణేశ్ మాస్టర్ సెటిల్ అయిపోయాడు. కానీ.., నిన్న మొన్నటి వరకు అందరూ ఇది టెంపరరీ చేంజ్ అనుకున్నారు. కానీ.., ఇప్పుడు మల్లెమాల నుండి శేఖర్ మాస్టర్ పూర్తిగా బయటకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.
శేఖర్ మాస్టర్ ప్రస్తుతం మరో ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి మల్లెమాల ఉద్వాసన పలకడానికి ఈ పోగ్రామే కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మల్లెమాల షోస్ లో కనిపించే స్టార్స్ కి కచ్చితంగా ఓ బాండ్ ఉంటుంది. దీని ప్రకారం వీరు.. పర్మిషన్ లేకుండా మల్లెమాల షోస్ లో తప్పించి మిగతా షోస్ లో కనిపించకూడదు. అయితే.., శేఖర్ మాస్టర్ ఆ బాండ్ ని బ్రేక్ చేశారని.., ఇందుకే మల్లెమాల ఆయన్ని ఢీ షో నుండి తప్పించిన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.., ఈ విషయంలో శేఖర్ మాస్టర్ నుండి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.