“పుష్ప” ది రైజ్.. ఇన్ని రోజులు బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది ఈ సినిమా కోసమే. కానీ.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పుష్ప మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోకి ఉండాల్సిన ఎలివేషన్స్ లేవు అనేది ఫ్యాన్స్ ప్రధాన కంప్లైంట్. కానీ.. మీకు గుర్తుందా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు గతంలో పుష్ప మూవీ 10 కేజీఎఫ్ లతో సమానమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 కేజిఎఫ్ లతో సమానమైన పుష్పకి మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది? అసలు కేజీఎఫ్ లో ఉన్నదేంటి? పుష్పలో లేనిది ఏమిటి? తగ్గేదే లే.. అంటూ వచ్చిన పుష్ప ఎందుకు తగ్గింది? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1) కేజిఎఫ్ లో హీరో పేదవాడిగా మాత్రం చనిపోను అని తన తల్లికి మాట ఇస్తాడు. తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి తానే ఒక బ్రాండ్ గా ఎదగాలని కసితో ఎదుగుతాడు. పుష్పది కూడా ఇదే కథ. కానీ.. ఇంటి పేరు కోసం పుష్ప పడే కష్టాన్ని ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి కావాల్సిన ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ పుష్పలో పడలేదు.
2) ఎర్రచందనం చెట్లు నరికే కూలీగా మారి.. అక్కడి నుంచి ఒక్కో మెట్టు పైకెక్కుతూ స్మగ్లర్ అవతారం ఎత్తుతాడు పుష్ప రాజ్. కానీ కేజీఎఫ్ లో హీరో క్యారెక్టర్ ఎప్పుడూ ఒకరి కింద పని చేసినట్టు అనిపించదు. రాఖీ భాయ్ ఏమి చేసినా.. అందులో దునియాకి కింగ్ కావాలన్న కసి కనిపిస్తుంది.
3) పుష్ప రైజ్ అయ్యే విధానం అంతా అతని అవసరంగా మాత్రమే చూపించారు. ఈ ప్రాసెస్ లో లాభం హీరోకి మాత్రమే. కానీ.. కేజీఎఫ్ కాన్సెప్ట్ అది కాదు. కేజీఎఫ్ నలిగిపోతున్న మనుషులను హీరో ఎలా కాపాడాడన్న బలమైన సన్నివేశాలను దర్శకుడు చూపించాడు. కాబట్టి.. కేజీఎఫ్ లో హీరో సక్సెస్ లో ఎక్కడా స్వార్థం కనిపించదు.
4) అన్నిటికీ మించి పుష్పలో హీరో క్యారెక్టరైజేషన్.. కథలో అవసరం బట్టి తగ్గుతూ, లేస్తూ వస్తుంది. కానీ.. కేజీఎఫ్ లో రాఖీ క్యారెక్టర్ మాత్రం తగ్గేదే లే అన్నట్టు చూపించారు.
ఇలా ఈ రెండు సినిమాలకి కథా కథనం విషయంలోనే చాలా తేడాలు ఉన్నాయి. కానీ.. అప్పట్లో సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు మాత్రం ఈ మిక్స్డ్ టాక్ పుష్పని 10 కేజీఎఫ్ లతో సమానమని స్టేట్మెంట్ ఇవ్వడమనేది చర్చనీయాంశంగా మారింది. మరి.. పుష్ప మూవీ కేజీఎఫ్ ని మరిపించే స్థాయిలో ఉందా.. లేదా? అనేది మిరే చెప్పాలి. ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.