సినీ ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్ రెండు నెలల వ్యవధిలో కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి ప్రముఖ నటులు కన్ను మూశారు. నెలన్నర వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందిన వారు మృతి చెందిన సమయంలో.. అభిమానులే కాక.. ఇండస్ట్రీకి చెందిన వారంతా వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఓ అంశం అందరిని ఆలోచింపచేస్తోంది.
ఏంటంటే.. సినీ ప్రముఖులు మృతి చెందినప్పుడు.. స్టార్ నటులు స్వయంగా.. మృతి చెందిన నటీనటలు ఇళ్లకు వెళ్లి.. నివాళులు అర్పిస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం.. ఇటీవల ఏ సెలబ్రిటీ చనిపోయినా.. సరే.. చివరి చూపు చేసేందుకు.. నివాళులు అర్పించేందుకు వెళ్లలేదు. దీనిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. వీరు మృతి చెందని సందర్భాల్లో.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. స్వయంగా వచ్చి నివాళులు అర్పించారు. ఆ రోజు రావడానికి కుదరని వాళ్లు.. తర్వాత వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. కానీ నాగార్జున మాత్రం ఎక్కడా కనపడలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన షూటింగ్ నిమిత్తం.. విదేశాల్లో ఉండటంతో.. నివాళులు అర్పించేందుకు రాలేదని అభిమాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అందుబాటులో ఉండి కూడా ఈమధ్య కాలంలో నాగార్జున పలువురు సెలబ్రిటీలు మృతి చెందినప్పుడు కడసారి చూపుకు రాలేదు. దాంతో.. నాగార్జున తీరు చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ హీరో, నాగార్జున తండ్రి నాగేశ్వరరావు.. మృతి చెందినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు.. స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు. కానీ కొన్నాళ్లుగా.. ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే.. నాగార్జన ఆఖరి చూపు చూడటం కోసం వెళ్లడం లేదు. మూడు, నాలుగు రోజుల తర్వాత వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శిస్తున్నాడు తప్పితే.. పార్థివ దేహాలకు నివాళులు అర్పించడం లేదు.
అయితే ఆయన సంగతి పక్కన పెడితే.. కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కృష్ణ మృతి చెందిన సమయంలో నాగచైతన్య.. స్వయంగా వెళ్లి.. నివాళులు అర్పించి.. మహేష్ బాబును ఓదార్చాడు. ఇక పెళ్లిల్లు, ఇతర పార్టీలకు హాజరయ్యే నాగార్జున.. సెలబ్రిటీలు కన్ను మూస్తే.. వారిని చివరి చూపు చూసేందుకు ఎందుకు వెళ్లడం లేదనే విషయం మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు.
కొందరు అభిమానులు మాత్రం.. చనిపోయిన వారిని… కడసారి చూసి తట్టుకునే ధైర్యం అందరికి ఉండదు.. సున్నిత మనస్కులు చాలా బాధపడతారు.. తాము ఎంతో ప్రేమించిన వ్యక్తులు అలా విగతజీవిగా పడి ఉంటే తట్టుకోలేరు.. బహుశా నాగార్జున కూడా ఈ కారణం చేతనే.. సెలబ్రిటీలు చనిపోతే.. వారి పార్థీవ దేహాలను చూడటానికి వెళ్లడం లేదు అంటున్నారు. ఏది ఏమైనా నాగార్జున తీరు మాత్రం.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై నాగార్జున స్పందిస్తేనే.. ఒక క్లారిటీ వస్తుంది. మరి నాగార్జున స్టార్స్ ఆఖరి చూపుకు ఎందుకు వెళ్లడం లేదు అనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.