Meena: ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ అనారోగ్యం కారణంగా ఆయన గత కొద్దిరోజులనుంచి ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యపరిస్థితి దారుణంగా క్షీణించి మృత్యువాతపడ్డారు. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. మీనా, విద్యాసాగర్ జంటకు కొడుకులు ఎవరూ లేరు. ఒక కూతురు నైనిక ఉంది. దీంతో ఈ అంత్యక్రియల్ని మీనా దగ్గరుండి చూసుకున్నారు. భర్త అంత్యక్రియల్ని ఆమె స్వయంగా చూసుకోవటానికి మరో కారణం కూడా ఉంది.
తనకు తన భర్త, కూతురు అంటే ఎంతో ప్రేమని చాలా సందర్బాల్లో మీనా చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వటానికి భర్త విద్యాసాగర్ ఎంతో సపోర్టు చేశారని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. విద్యాసాగర్ వంటి భర్త దొరకటం తన అదృష్టం అని ఆమె కొనియాడారు. అందుకే! తనకు భర్తపై ఉన్న ప్రేమను ఆఖరి క్షణం వరకు తెలుపుకున్నారు. వేరే వాళ్లెవ్వరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. స్వయంగా భౌతిక కాయాన్ని చితిలో కాల్చే చోటు వరకు వచ్చారు. దగ్గరుండి చివరి కార్యక్రమాలను చూసుకున్నారు.
అంత్యక్రియల అనంతరం చితాభశ్మాన్ని స్వయంగా ఆమె ఇంటికి తీసుకెళ్లిపోయారు. భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనాను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీనా నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అని కొనియాడుతున్నారు. కాగా, మీనా స్టార్డమ్ లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. అప్పటినుండి హీరోయిన్ గా సినిమాలు తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతోంది.
ఇక మీనా – విద్యాసాగర్ జంటకు 2011లో కూతురు నైనిక జన్మించింది. అయితే.. అటు ఫ్యామిలీతో, ఇటు సినిమాలతో సాఫీగా సాగిపోతున్న మీనా లైఫ్ లో భర్త మరణంతో తీరని విషాదం చోటుచేసుకుంది. మరి, భర్త విద్యాసాగర్ లేని లోటు మీనాకు తీర్చలేనిది అయినప్పటికి.. బిడ్డ కోసం ఆమె త్వరగా మామూలు మనిషి కావాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Meena: స్టార్ హీరోయిన్ అయిన మీనా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకోవడానికి కారణం?