ఇండస్ట్రీలో ఒక్కోసారి మంచి అవకాశాలు చేజారిపోతుంటాయి. అతడు, పోకిరి వంటి సినిమాలని పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నారు. ఆర్య, భద్ర వంటి సినిమాలు ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలను కొంతమంది హీరోలు చేజార్చుకున్నారు. ఈ కోవలోనే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కూడా మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వస్తే చేజేతులారా మిస్ చేసుకుంది. దీంతో కియారా అద్వానీ పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ బోల్డ్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 2018లో బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ బాలీవుడ్ సిరీస్ లో రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్, మనీషా కొయిరాలా, కియారా అద్వానీ, నేహా ధూపియా వంటి భామలు నటించారు. ఇటువంటి సిరీస్ లో నటించే అవకాశం వస్తే సారీ చెప్పేసిందట కృతి.
ఈ లస్ట్ సిరీస్ వెబ్ సిరీస్ ని అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ మొత్తం నలుగురు దర్శకత్వం వహించారు. మొదట ఈ సిరీస్ లో కియారా అద్వానీ స్థానంలో కృతి సనన్ ని అనుకున్నారట కరణ్ జోహార్. కృతి సనన్ ను సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది కృతి సనన్. ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించవద్దని ముందే ట్రైనింగ్ ఇచ్చి పంపించిందట. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి సనన్, ఆమె తల్లి గీత సనన్ పాల్గొన్నారు. తన కూతురు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం లేదని, అందుకే తన కూతుర్ని అలాంటి సన్నివేశాలున్న సినిమాల్లో నటించేందుకు అనుమతించలేదని కృతి తల్లి గీత సనన్ తెలిపింది.
తన కూతురుతో కలిసి ఆ లస్ట్ సిరీస్ చూడ్డం తనకిష్టం లేదని, ప్రైవేట్ పార్ట్ దగ్గర చేయి పెట్టుకుని బోల్డ్ సీన్ లో తన కూతురు నటించడం ఇష్టం లేకనే ఆ సిరీస్ రిజెక్ట్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇక కృతి సనన్ మాట్లాడుతూ.. ‘మా అమ్మకు లస్ట్ స్టోరీస్ స్క్రిప్ట్ నచ్చలేదని, అందుకే ఆ పాత్రకు నో చెప్పాల్సి వచ్చింది. నేను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించాలని అమ్మను ఎప్పుడూ అడగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
అదీ మేటర్. ఒక పక్క అమ్మ, మరో పక్క తాను పెరిగిన మిడిల్ క్లాస్ వాతావరణం ఈ రెండూ కృతి సనన్ ని బోల్డ్ సీన్స్ లో చేయకుండా ఆపుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘లస్ట్ స్టోరీస్ లో నటించకుండా మంచి పని చేసింది. లేదంటే తమ అన్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో లస్ట్ స్టోరీస్ లో చేసిన నటి నటిస్తే జీర్ణించుకోలేకపోయేవాళ్ళం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం.. ఎక్స్ పోజింగ్ చేసినప్పుడు ఏమైంది ఈ బుద్ధి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్లామర్ ఒలకబోయడం, బోల్డ్ సీన్స్ లో నటించడం ఈ రెండిటి మధ్య నట్టుకి, బోల్టుకి ఉన్నంత తేడా ఉందని అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరిష్టం వారిది.
ఇదిలా ఉంటే కియారా అద్వానీ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇక కృతి సనన్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇద్దరూ తెలుగు హీరో మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ లో ల్యాండ్ అయిన వాళ్లే. కృతి సనన్ మహేష్ వన్ నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇవ్వగా, భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఇప్పుడు తెలుగు హీరోల సినిమాలతో ఈ ఇద్దరూ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నారు. ఈ హీరోయిన్స్ కెరీర్ లో కొన్ని సంఘటనలు యాధృచ్చికంగా జరగడం విశేషం.
#KritiSanon‘s mother said that she would not have been comfortable watching Karan Johar’s Lust Stories had Kriti starred in the short filmhttps://t.co/wsgSvXFhbT
— Indian Express Entertainment 😷 (@ieEntertainment) October 31, 2022