ఇటీవల ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ బాలీవుడ్ నటి రిచా చడ్డా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. అటు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నటి రిచాను విమర్శిస్తూ ఇప్పటివరకు చాలామంది సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఈ వ్యవహారంలో నటుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి హాట్ టాపిక్ గా మారాడు. చిన్న వ్యవహారం చిరిగి చిరిగి గాలివానలా మారుతుంది అన్నట్లుగా.. రిచా చద్దా ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రిచా చేసిన ట్వీట్ పై హీరో అక్షయ్ కుమార్ కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా అక్షయ్ కుమార్ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ ట్వీట్ పెట్టి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అక్షయ్ కుమార్ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. “రిచా చడ్డా మీరు ఇలా అంటారని అసలు అనుకోలేదు. ఇండియన్ ఆర్మీ ఉంది కాబట్టి.. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం” అని ట్వీట్ చేశాడు. అయితే.. ఆల్రెడీ ఈ వ్యవహారంపై చాలామంది విమర్శిస్తూ స్పందించడంతో రిచా చడ్డా క్షమాపణలు కోరింది. కానీ.. ఆమె సైలెంట్ అయ్యింది గానీ, వివాదం మాత్రం ఆగట్లేదు. ఈ విషయంలో కొందరు అక్షయ్ కుమార్ ని సపోర్ట్ చేయగా.. మరికొందరు అక్షయ్ పైనే కెనడా కుమార్ అంటూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ కూడా అక్షయ్ పైనే సెటైర్ వేయడం గమనార్హం.
ఈ క్రమంలో అక్షయ్ పై ప్రకాష్ రాజ్ సెటైర్ వేస్తూ.. “నేను మీ నుండి ఇది అసలు ఊహించలేదు. మీకంటే ఇండియన్ సిటిజెన్ గా ఇక్కడ రిచానే ఎక్కువ కదా..! లేదు ఊరికే అడుగుతున్నా!” అని ట్వీట్ చేశాడు. అంటే.. కెనడా సిటిజెన్ షిప్ కలిగి ఉన్న అక్షయ్ కుమార్ 30 ఏళ్ళ క్రితం ఇండియాకి వచ్చి నటుడిగా సెటిల్ అయ్యాడు. అతనికంటే మొదటి నుండి ఇండియన్ సిటిజెన్ షిప్ కలిగి ఉన్న రిచా చద్దానే ఇండియాలో ఎక్కువ కదా అనే విధంగా వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట విమర్శలు మొదలయ్యాయి.
అసలు రిచా చడ్డా ట్వీట్ పై హీరో అక్షయ్ కుమార్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆ ట్వీట్ లో నటి రిచాని కూడా అక్షయ్ ఏమి అనలేదు. కానీ.. ఈ విషయం మధ్యలో ప్రకాష్ రాజ్ దూరి.. రిచా చడ్డాను కాకుండా, అక్షయ్ కుమార్ పై కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ స్పందిస్తే జరుగుతున్న వివాదంపై స్పందించాలి గానీ, ఇలా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గా నిలిచిన అక్షయ్ కుమార్ పై సెటైర్స్ వేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. అందరిదీ ఓ గోల అయితే., ప్రకాష్ రాజ్ ది మరో గోల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వివాదానికి సంబంధం లేకుండా ప్రాంతీయతను లాగడం ఏంటని.. దేశానికి సపోర్ట్ గా నిలిచారా లేదా చూడాలని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Didn’t expect this from you @akshaykumar ..having said that @RichaChadha is more relevant to our country than you sir. #justasking https://t.co/jAo5Sg6rQF
— Prakash Raj (@prakashraaj) November 25, 2022