సాధారణంగా వయసు మీదపడుతున్న సినీతారలు ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు వినిపిస్తారా..? అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఈ జాబితాలో దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఎప్పటినుండో వినిపిస్తోంది. అయితే.. కొన్నేళ్లుగా నయన్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి లాక్ డౌన్ సమయంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకునేందుకు ఈ జంట తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది.
దైవ సన్నిధిలో నయన్ – విఘ్నేష్ పెళ్లికి డేట్ కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 9న ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. అయితే.. నయన్ – విఘ్నేష్ ల పెళ్లి తిరుపతిలో జరగనుంది ఓకే.. కానీ వీరి పెళ్ళికి తిరుపతినే పెళ్లి వేదికగా ఎంచుకోవడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నయన్ పెళ్లిని తిరుపతిలో ఫిక్స్ చేసుకోవడానికి కారణాలు లేకపోలేదు అంటున్నాయి సినీవర్గాలు.
తాజాగా సమాచారం ప్రకారం.. ఒక నటిగా కెరీర్ లో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినప్పటికీ, పర్సనల్ లైఫ్ పరంగా నయనతార ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. లైఫ్ లో రెండుసార్లు(మొదట హీరో శింబుతో, రెండోసారి కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో) ప్రేమ విఫలమై డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది. కొన్ని నెలలకే డిప్రెషన్ నుండి బయటకి వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పరిచయమై ప్రేమలో పడింది.
Congratulations to the beautiful couple of Tamil film industry @VigneshShivN nd #Nayanthara who are getting married on 9th might be in Tirumala Tirupathi 🙏❤🥳💥
All the best for your future sending lots of success nd happiness to both of you 💐✨🤗#KaathuVaakulaRenduKadhal pic.twitter.com/unt4FFyz0I
— Sam❤Anu (@samzcraziestfan) May 7, 2022
దాదాపు ఏడేళ్లుగా వీరిద్దరూ స్ట్రాంగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే.. తిరుపతిలో పెళ్లి ఫిక్స్ చేసుకోవడానికి ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఏడేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ప్రేమలో ఉన్న నయన్ – విఘ్నేష్ ల అనుబంధం.. పెళ్లి తర్వాత మరింత బలపడాలని.. తిరుపతి దైవ సన్నిధిలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నట్లు తమిళ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరి ఇప్పటికే లైఫ్ లో రెండుసార్లు గాయపడిన నయన్.. తన ప్రేమ పెళ్లికి ఎప్పటికీ ఎలాంటి అడ్డంకులు రాకుండా దాంపత్య జీవితం సాఫీగా సాగాలని తిరుపతిలో ముహూర్తం ఫిక్స్ చేసుకుందట. మరి నయన్ – విఘ్నేష్ ల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.