అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR‘. పీరియాడిక్ ఫిక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ట్రిపుల్ ఆర్ మూవీ.. చివరి నిమిషంలో కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే.. ప్రస్తుతం RRR ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
తాజాగా దర్శకనిర్మాతలు RRR మెయిన్ ప్రమోషనల్ ఈవెంట్ లను దుబాయ్, చిక్కబళ్లాపూర్ లలో ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో పెద్దగా ఈవెంట్స్ ఏమి లేవనే వార్త అటు నందమూరి అభిమానులను, ఇటు మెగా అభిమానులను నిరాశకు గురిచేసింది. RRR మెయిన్ ఈవెంట్ ని తెలుగు రాష్ట్రాలలో కాకుండా చిక్కబళ్లాపూర్ లో ప్లాన్ చేయడానికి కారణమేంటి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తెలుగు రాష్ట్రాలలో ట్రిపుల్ ఆర్ ఈవెంట్ జరిపితే.. జనాలను మేనేజ్ చేయడం కష్టం అవుతుందని అక్కడ ప్లాన్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే చిక్కబళ్లాపూర్.. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఏరియా దాటితే అంతా తెలుగువారే ఎక్కువగా ఉంటారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ఈ ఏరియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది.
ఆ కారణంగా దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ ఈవెంట్ కోసం చిక్కబళ్లాపూర్ ఎంచుకున్నట్లు సమాచారం. అదేవిధంగా మార్కెట్ పరంగా కర్ణాటక కూడా పెద్దదే. అంతేగాక అటు కన్నడ, ఇటు తెలుగు ప్రాంతాలను ఒకేసారి కవర్ చేసే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్. అయితే.. ఈ ఈవెంట్ కి సుమారు 2 – 3 లక్షల మంది హాజరు కాబోతున్నారట. మామూలుగానే ప్రమోషన్స్ ప్లాన్ చేయడంలో రాజమౌళి మాస్టర్. మరి తెలుగు రాష్ట్రాలను ప్రమోషన్లకు దూరంగా ఉంచి కర్ణాటకలో ప్లాన్ చేయడం వెనుక అసలు కారణమేంటి అనేది ఆయనే చెప్పాల్సి ఉంది.ఇక ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్రబృందం, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ముఖ్య అతిథులుగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక హెల్త్ మినిస్టర్, స్టార్ హీరో శివరాజ్ కుమార్ లు పాల్గొనబోతున్నట్లు సమాచారం. దర్శక నిర్మాతలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేయనున్నారు. మరి ట్రిపుల్ ఆర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.