సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. శనివారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడుతున్న క్రమంలో ఒక అభిమాని ఏకంగా తోసుకుని స్టేజిమీదకు పవన్ ని కలిసేందుకు వచ్చాడు.
పవన్ ఎప్పుడూ ఎవరి మీద సీరియస్ అవ్వలేదు. కానీ.. ఈ ఫంక్షన్ లో ఎందుకు అయ్యాడంటే.. ఆయన రిపబ్లిక్ ఈవెంట్ వేదికపై నుండి కొన్ని సీరియస్ ఇష్యూస్ గురుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అవి సమాజానికి, ఇండస్ట్రీకి పనికి వచ్చేవి. అలాంటి సందర్భంలో కూడా అభిమానం పేరిట ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడం పవన్ కి నచ్చలేదు. అందుకే ఇలా తోసి వేశాడు. ఇలా పవన్ స్టేజ్ పై ఉన్నప్పుడు ఫ్యాన్స్ తోసుకుని రావడం కొత్త కాదు. ఇలా ఎన్నో సందర్భాల్లో కూడా పవన్ ఫ్యాన్స్ ఆయనతో కలిసి ఫోటో దిగేందుకు ఆరాటపడుతు ఉండటం మనం చాలానే చూసి ఉంటాం. ఇక ఈ వేదికపై పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ, టికెట్ అంశాలపై కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడారు.