దేశ చిత్రపరిశ్రమలో ప్రస్తుతం తెలుగు చిత్రాల హవా కొనసాగుతోంది. బాహుబలి మొదలుకొని కబీర్ సింగ్, బాహుబలి 2, పుష్ప ఇలా వరుసగా తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ RRR విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న రిలీజ్ కానున్న RRR సినిమాకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా RRR ప్రమోషన్స్ లో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పాల్గొనడంపై ప్రేక్షకులకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బాహుబలి, బాహుబలి 2 సినిమాలకు నిర్మాత కరణ్ జోహార్ తరపున ఫుల్ సపోర్ట్ లభించింది. కానీ బాలీవుడ్ స్టార్ హీరోలెవరూ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే.. అప్పుడు టాలీవుడ్ సినిమా స్థాయి, తెలుగు దర్శకుల సత్తా తెలియక పోటీగా ఫీలయ్యారు. ఇక ఎప్పుడైతే బాహుబలి 2, కబీర్ సింగ్, పుష్ప సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేసి తెలుగు సినిమా దమ్ము చూపేసరికి.. బాలీవుడ్ స్టార్స్ సైతం కంప్రమైజ్ అయ్యారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ లాంటి హీరోలు కదిలివస్తున్నారు.వాళ్ళకి కూడా తెలుగు సినిమా స్థాయి, దర్శకుల విజన్ అర్థమైంది. అందుకే ఇప్పుడు RRR సినిమాకు బాలీవుడ్ లో స్టార్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకు తెలుగు హీరోలను పోటీగా భావించిన స్టార్ హీరోలు.. ఇప్పుడు వారంతట వారే వచ్చి సపోర్ట్ చేస్తుండటం విశేషం. అదీగాక రాజమౌళి బ్రాండ్ వేల్యూ, RRR రేంజి తెలిసొచ్చిందని చెప్పాలి. అందుకే ఇప్పుడు తెలుగు హీరోలతో, దర్శకులతో పని చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ టాక్. మరోవైపు వాళ్ళ సినిమా రిలీజులు లేవు కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.