Tollywood Heroes: సినీ ఇండస్ట్రీలో హీరోలపై ట్రోలింగ్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. హిట్స్ లో ఉన్నా, ప్లాప్స్ లో ఉన్నా.. మామూలుగా స్టార్ హీరోల సినిమాలపై ట్రోల్స్ వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల లుక్స్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. సాధారణంగా దక్షిణాది సినీ ప్రేక్షకులు బాలీవుడ్ హీరోలపై, వారి లుక్ పై ట్రోలింగ్ చేయడమనేది రేర్ అరుదు. కానీ.. బాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఇప్పుడు దక్షిణాది స్టార్స్ సినిమాలను ఆదరిస్తూ, వారి లుక్స్ పై ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ హీరోల హవా నడుస్తోంది. అందులోనూ ముఖ్యంగా తెలుగు హీరోల సినిమాలే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ ఏడుపంతా తెలుగు హీరోలపైనే అంటున్నాయి సినీవర్గాలు. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్నటువంటి ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబులను టార్గెట్ చేసి.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.
ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ బయట కనిపించిన లుక్ పై ‘వడాపావ్’ అంటూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ టైంలో సన్నగా కనిపించిన ప్రభాస్.. ఆ తర్వాత షూటింగ్ అయిపోయాక కాస్త లావుగా, లూస్ టీ షర్ట్ ప్యాంటుతో కనిపించేసరికి అలాంటి కామెంట్స్ చేశారు. ఇటీవల డైరెక్టర్ ఓం రౌత్ ఇంటివద్ద హ్యాండ్సమ్ లుక్ లో కనిపించినా.. అంకుల్ లా ఉన్నదంటూ కామెంట్స్ పుట్టించారు బాలీవుడ్ ఆడియెన్స్. కానీ.. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.
ఇక పుష్ప సినిమాతో సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు బన్నీ. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ, కేవలం బాలీవుడ్ మార్కెట్ లోనే 100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సెట్ చేశాడు. పుష్ప మూవీలో బన్నీ మాస్ లుక్, యాటిట్యూడ్ చూసి చప్పట్లు కొట్టిన బాలీవుడ్ జనాలే.. ఇటీవల బన్నీ లూస్ టీషర్ట్ ధరించి కనబడేసరికి ‘వడాపావ్’లా తయారయ్యావు అంటూ ట్రోల్స్ చేశారు. అయినాసరే.. ట్రోల్స్ ఏవి లెక్కచేయకుండా పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు బన్నీ.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకూ పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ, సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పటికీ మహేష్ ఎప్పుడెప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తాడా? అని వెయిట్ చేస్తున్నారు నార్త్ ఆడియెన్స్. కానీ.. ఇటీవల మేజర్ రిలీజ్ టైంలో మహేష్ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ట్రోలింగ్ కి కారణమయ్యాయి. బాలీవుడ్ తనను భరించలేదని కామెంట్ చేశాక.. మహేష్ బాలీవుడ్ పాన్ మసాలా యాడ్ లో నటించాడు. బాలీవుడ్ అయితే భరించలేదు కానీ.. మిమ్మల్ని పాన్ మసాలా భరిస్తుందా? అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇక ఈ కామెంట్స్ ని కూడా మహేష్ బాబు లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే.. బాలీవుడ్ పై, తన సినిమాలపై పూర్తి క్లారిటీగా ఉన్నాడు మహేష్. ఈ క్రమంలో బాలీవుడ్ ఆడియెన్స్ సౌత్ హీరోల పై చేసే కామెంట్స్ ని హీరోలు తేలికగా తీసుకోవచ్చేమోగాని.. ఫ్యాన్స్ మాత్రం తేలికగా తీసుకోవట్లేదు. బాలీవుడ్ లో కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేవు. వాళ్ళ హీరోలు సౌత్ లో మార్క్ క్రియేట్ చేయలేకపోతున్నారు. బాలీవుడ్ సినిమాలు తెలుగులో ఆడట్లేవు. కానీ.. తెలుగు హీరోలు మాత్రం బాలీవుడ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు.
కాబట్టి.. ఈ కారణంగానే తెలుగు హీరోలపై బాలీవుడ్ వారు ఏడుస్తున్నారని, కుళ్ళుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు త్వరలోనే ప్రభాస్ ఆదిపురుష్ తో.. బన్నీ పుష్ప 2తో.. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ తో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇవన్నీ ఓర్వలేకే బాలీవుడ్ ట్రోలింగ్ పనిలో పడిందని టాక్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Netizens troll Mahesh Babu for endorsing pan masala brand after his claim ‘Bollywood can’t afford me’
Read @ANI Story | https://t.co/CdYT77vjPs#MaheshBabu #panmasalaadverisement #Bollywood #MaheshBabuonBollywood pic.twitter.com/2eWKAuJNSa
— ANI Digital (@ani_digital) May 18, 2022
#Pushpa star #AlluArjun gets massively fat shamed for his latest appearance; netizens call him, ‘vada pav’ .
Please guys don’t troll our demi god, may be he is fat, not so good looking, talentless but he is our demi god. I request guys.
https://t.co/piHWUIVCzI— Sushil sinha (@SushilSinha_108) June 26, 2022