దసరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద బిగ్ స్టార్స్ సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ జరగబోతుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’.. మరోవైపు కింగ్ నాగార్జున నటించిన ‘ఘోస్ట్’.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. దీంతో అటు మెగా ఫ్యాన్స్ లో, ఇటు అక్కినేని ఫ్యాన్స్ లో సినిమాల ఫలితాలకు సంబంధించి ఆలోచనలు పక్కనపెడితే.. ఇద్దరు స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. వీరిద్దరి సినిమాలను ఫ్యాన్ బాయ్స్ అయినటువంటి మోహన్ రాజా, ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. అయితే.. చిరంజీవి, నాగార్జునల ఫ్యాన్ బేస్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక విడుదలకు సిద్ధంగా మెగాస్టార్ సినిమా ఉన్నా, నాగార్జున సినిమా ఉన్నా వారి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఫ్యాన్స్ అందరిలోనూ ఆనందం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కాకపోతే ఒకేరోజు బాక్సాఫీస్ బరిలోకి ఏ స్టార్ హీరోల సినిమాలు వచ్చినా.. పైచేయి ఎవరిది? ఎవరు నిలబడతారు, ఎవరు నిరాశపరుస్తారు? అనే టెన్షన్ కూడా ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. అయితే.. ఈసారి సినిమాలు ఎలా ఉండబోతున్నాయనేది మినహాయిస్తే.. ఓ మంచి ఫెస్టివల్ టైంలో చిరు, నాగ్ బరిలోకి దిగబోతున్నారు. అదీగాక ఇప్పుడు ఉద్యోగులతో పాటు విద్యాసంస్థలకు కూడా సెలవులు కావడంతో రెండు సినిమాలకు కలెక్షన్స్ పరంగా భారీగా రాబట్టే అవకాశమైతే ఉంది.
ఈ క్రమంలో మెగాస్టార్, కింగ్ నాగ్ ఇద్దరూ సినిమాల కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే.. ఫ్యాన్స్ కి ఏమి కావాలో ఈ సీనియర్ హీరోలిద్దరికి బాగా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ తో పాటు ట్రెండ్ కి తగ్గ అంశాలను కూడా తమ సినిమాలలో ప్రస్తావిస్తుంటారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ టీజర్, ఘోస్ట్ మూవీ ట్రైలర్.. సాంగ్స్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. ఇక చిరు, నాగ్ బయట కూడా మంచి స్నేహితులు. మరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సినిమా వార్ ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ.. అసలు విషయం ఏంటంటే.. ఇద్దరి సినిమాలపై ప్రేక్షకులలో పాజిటివ్ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ కి, నాగార్జునకి ఇద్దరికీ కూడా ఈ రెండు సినిమాలు చాలా ఇంపార్టెంట్. ఇద్దరికీ సోలోగా హిట్ పడి చాలా కాలమైంది. చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ స్థాయి హిట్టు పడలేదు. ఇటు నాగార్జునకి సోగ్గాడే చిన్నినాయన తర్వాత బ్లాక్ బస్టర్ రాలేదు. సో.. వీరిద్దరికి గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలు ముఖ్యమనే చెప్పాలి. అలాగని సినిమాల ఫలితాలు తారుమారు అయితే.. వీరి స్థాయికి ఏమాత్రం భంగం కలగదు అనేది ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలు చాలా హెల్తీ వాతావరణంలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే నాగ్ కూడా గాడ్ ఫాదర్ సినిమాను హిట్ చేయాలనీ కోరాడు. మరి చిరు, నాగ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.
One More #PanIndia Release: #Nagarjuna Starrer ‘The Ghost’ To Release In Tamil And Hindi On October 5, Set To Clash With Chiranjeevi & Salman Khan Starrer Godfather!#NagarjunaAkkineni #TheGhost #SonalChauhan #SalmanKhan #Chiranjeevi #GodFather https://t.co/YlJFV3EOrb pic.twitter.com/ApBLq9OnjS
— Box Office Worldwide (@BOWorldwide) September 26, 2022
Dosti @KChiruTweets 🤝 @iamnagarjuna
Sending our best wishes to team #Ghost from #GodFather fans ❤️ pic.twitter.com/H72ibZHAMZ
— Chiranjeevi Trends™ (@TrendsChiru) September 25, 2022