టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున-అమల సినిమాల్లో కలిసి నటించి.. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వారిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు. వారిద్దరినీ అడిగే ధైర్యం ఎవరూ చేయరు. అందుకే ది మోస్ట్ ఇంట్రస్టింగ్ విషయాన్ని అమల బ్రదర్ సురేష్ చక్రవర్తిని అడిగితే తెలిసింది. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో ఒక మిస్టరీలా ఉన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. అమలకు తొడబుట్టకున్నా.. సొంత అన్నలా ఉండే చక్రవర్తి ఈ మిస్టరీపై క్లారిటీ ఇచ్చారు.
నాగార్జున-అమల లవ్‌స్టోరీలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అనే ప్రశ్నకు సమాధానం ఆయన మాటల్లోనే.. ‘నేను అమల చాలా ఏళ్లుగా కలిసి అన్నాచెల్లెళ్ల ఉన్నా కూడా ఎవరి ప్రైవసీ వాళ్లకు ఉండేది. అలాగే నాగార్జునతో లవ్ గురించి తను ఎప్పుడూ నాతో చెప్పలేదు. అందరికీ వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు అర్థమవుతున్నట్లే నాకు తెలుస్తుంది. కానీ.. నేను దాని గురించి అమలను అడగలేదు.. ఆమె కూడా నాతో చెప్పలేదు. దీంతో ఎవరు ముందు ప్రపోజ్ చేశారనే విషయం నాకు కూడా అంతగా తెలియదు. కానీ.. ముందుగా నాగార్జుననే ప్రపోజ్ చేశాడు. సారీ నాగ్.. తప్పు అయితే నన్ను క్షమించు’ అంటూ వెల్లడించారు. దీన్ని బట్టి అమలకు తన మనసులోని మాటను ముందుగా నాగార్జుననే క్లారిటీ వచ్చింది. ఇదే కాకుండా చక్రవర్తి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కింద ఉన్న వీడియోను ఆ విషయాలను మీరూ తెలుసుకోండి.