పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భీమ్లా నాయక్‘ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేసిన చిత్రబృందం.. బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ స్పందన అయితే లభించింది. కానీ వేడుకలో అగ్రదర్శకుడు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ త్రివిక్రమ్.. చివరివరకు కనిపించకపోవడం, మాట్లాడకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా ఇదే చర్చ నడుస్తోంది. భీమ్లా నాయక్ ఆర్టిస్టుల దగ్గర నుండి దర్శకనిర్మాతల వరకు అందరూ త్రివిక్రమ్ లేకపోతే భీమ్లా నాయక్ లేదంటూ చెప్పుకొచ్చారు. అలాంటిది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న త్రివిక్రమ్.. అలా వచ్చి మంత్రి కేటీఆర్ కి బొకే అందించి మళ్లీ కనిపించలేదు. ఈవెంట్ లో పాల్గొన్న స్టార్స్ తో పాటు అభిమానులు కూడా త్రివిక్రమ్ స్పీచ్ కోసం వెయిట్ చేశారు.
మరి త్రివిక్రమ్ అలా సైలెంట్ గా వెళ్లిపోవడానికి కారణమేంటి? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. త్రివిక్రమ్ కావాలనే సినిమాకి దూరంగా ఉంటున్నట్లు టాక్ నడుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదని పలు వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించింది డైరెక్టర్ సాగర్ కే చంద్ర అయినప్పటికీ, క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కొట్టేశాడని కామెంట్స్ రావడంతో ఆయన దూరంగా ఉంటున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న పెద్ద ఎత్తున థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా రికార్డులు నమోదు చేసింది. మరి సినిమా నుండి తాజాగా మరో ట్రైలర్ వదిలారు మేకర్స్. రానా మరో హీరోగా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి భీమ్లా నాయక్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.