ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఇద్దరు దక్షిణాది అగ్రదర్శకుల గురించే మాట్లాడుకుంటోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు రాజమౌళి, మరొకరు ప్రశాంత్ నీల్. ఎన్నో ఏళ్లుగా రాజమౌళి అగ్రదర్శకుడిగా ఎదుగుతూ బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలతో బలమైన కోటను నిర్మించుకున్నాడు. అయితే.. ఇప్పుడు కేవలం మూడే మూడు సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్.. రాజమౌళి స్థాయి క్రేజ్, ఫేమ్ సొంతం చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.
ఓవైపు రాజమౌళి బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలను తెరకెక్కించి అన్ని భాషల్లో కలెక్షన్స్ మోత మోగించాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే.. ఈ కేజీఎఫ్ సినిమాను మొదటగా పాన్ ఇండియా స్థాయి సినిమా అవుద్దని ప్రోత్సహించిన వారిలో దర్శకుడు రాజమౌళి ముఖ్యపాత్ర పోషించాడు. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదలై సక్సెస్ అయ్యాక ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళి సహకారం గురించి ప్రస్తావించి తన వినమ్రతను చాటుకున్నాడు.
ఇక ఇటీవల కేజీఎఫ్-2 విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరోవైపు రాజమౌళి ట్రిపుల్ ఆర్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. అయితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 టైంలో రాజమౌళి ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ.. ట్విట్టర్ లో కూడా ప్రమోట్ చేశాడు. కానీ చాప్టర్-2 విషయానికి వచ్చేసరికి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం. ఇప్పటికి కేజీఎఫ్-2 విడుదలై వారం దాటినా రాజమౌళి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ విజయోత్సాహంతో ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు. మరోవైపు కేజీఎఫ్ రిలీజ్ అయ్యాక కూడా ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. అందువల్లే రాజమౌళి రెస్పాండ్ అవ్వలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాజమౌళి – ప్రశాంత్ నీల్ ఇద్దరూ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందినవారే అయినందుకు సంతోషించాలి. మరి కేజీఎఫ్-2 పై రాజమౌళి స్పందించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.