పాన్ ఇండియా మాస్, క్లాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ మూవీ ‘RRR‘. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ మూవీలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘RRR’ సినిమాకి సంబంధించి చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా.. RRR సినిమా రూపొందించాడు రాజమౌళి. ఇప్పటికే సినిమాకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో సెట్ చేశాయి. ఓవర్సీస్ లో కూడా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ స్పందన లభించింది. మరి RRR సినిమాకి పాన్ ఇండియాను మించిన క్రేజ్ రావడానికి కారణం ఏమయ్యుంటుంది? అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ క్రమంలో RRRకి అంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణంగా డైరెక్టర్ రాజమౌళి పేరు చెబుతున్నారు. ఎందుకంటే.. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ఆ క్రేజ్ మూలంగా ఆర్ఆర్ఆర్ సినిమాకి ఈ క్రేజ్ దక్కిందని అంటున్నారు. మరో కారణంగా స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. కానీ ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో.. అదికూడా పీరియాడిక్ మల్టీస్టారర్ అనేసరికి క్రేజ్ వచ్చిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. స్టార్ కాస్ట్, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ స్టోరీ కారణంగా ఇంత క్రేజ్ అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి అసలు RRR సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.