తెలుగులో బిగ్ బాస్ ఓటిటి సీజన్ ప్రారంభం అయింది. అప్పుడే షోలో.. ఫన్ కంటే కూడా ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. హౌస్ లో అడుగుపెట్టిన మొదటి నామినేషన్స్ లోనే ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు చేసుకుంటూ.. అవగాహన లేకుండానే ఒక అభిప్రాయాన్ని వచ్చేసి కామెంట్స్ చేసుకోవడం, హర్ట్ అయిపోయి కంటతడి పెట్టుకోవడం అన్ని మొదలయ్యాయి.
మొదటివారం నామినేషన్స్ లో నిందలు, నిందితులు, నిందించినవారు హైలైట్ అవుతున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ ఆర్జే చైతూ తనని బాడీ షేమింగ్ చేయడం నచ్చలేదంటూ నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశాడు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఇద్దరూ పోటాపోటీగా మాటలు సంధించుకున్నారు.ఇక బిగ్ బాస్ వారియర్స్ అంతా ఛాలెంజర్స్ నుండి ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పడంతో.. బెడ్ రూమ్ లో డిస్కషన్స్ జరిపి నటరాజ్ మాస్టర్ ని చైతూకి సారీ చెప్పండి మాస్టర్ అంటూ రిక్వెస్ట్ చేశారు. చివరిగా అందరూ కలిసి మిత్రాశర్మా, ఆర్జే చైతూలని నామినేట్ చేశారు. అదే సమయంలో అఖిల్ తో పాటు ఆర్జే చైతూ పేరు చెప్పడానికి వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయిపోయాడు.
ఈ హౌస్ లోకి తన బిడ్డని వదిలేసి వచ్చానని.. అయినా మీరు నామినేషన్ ట్యాగ్ తో బయటికి పంపించేయాలని చూస్తున్నారని కంటతడి పెట్టుకున్నాడు. అలాగే నేను సరదాగా అన్నానంటూ ఆర్జే చైతూకి సారీ చెప్తూ ఏడ్చేశారు. ఇలాంటివి చిన్నచిన్న అపార్థాలు ఏమైనా ఉంటే.. అప్పుడే సారీ చెప్పుకుంటే అయిపోతుంది కదా.. నామినేషన్స్ వరకు తెచ్చుకోవడం అవసరమా? అని చెప్పారు. దీనిపై వెంటనే ఆర్జే చైతూ వివరణ ఇచ్చాడు.
అదీగాక.. తనని ఎవరు ఏమన్నా భరిస్తా కానీ, బాడీ షేమింగ్ గురించి అనొద్దని.. అందుకే అలా మాట్లాడానని చెప్తూ ఎమోషనల్ అయిపోయి బాధపడ్డాడు. మిగతా ఇంటి సభ్యులు చైతన్యని ఓదార్చే ప్రయత్నం చేశారు. నటరాజ్ – చైతుల మధ్య మాటామాటా పెరిగినా చివరికి సారీ చెప్పుకొని ఇద్దరూ బాధపడ్డారు. ఇదిలా ఉండగా..మొదటివారం నామినేషన్స్ లో వారియర్స్ తో పాటు ఇద్దరు ఛాలెంజర్స్ కూడా నామినేట్ అయ్యారు. మరి మొదటి వారమే ఇంటి నుండి ఎవరు బయటకి వెళ్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి హౌస్ నుండి ఎవరు బయటికెళ్లారు? అనే విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Nominations bringing out the True Emotions!!⚔️😱💥💥
It’s 🔥🔥🔥🔥 in the House, ofcourse with Nonstop entertainment!! #Biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/n8XQVlJMLd— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2022