ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఓటీటీ వేదికలు ముందుంటున్నాయి. గతంతో పోల్చితే టెక్నాలజీ వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. దీనికి తోడు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో థియేటర్స్ మూసివేయడంతో ఓటీటీకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అదే కంటిన్యూ అవుతోంది. దీంతో థియేటర్స్ లో విడుదలైన బడా సినిమాలు సైతం నెల తిరిగేలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఓటీటీ బెస్ట్ ఫ్లాట్ ఫామ్స్ అయ్యాయి. ఈ క్రమంలో మరి ఈ వారంలో ఆన్ లైన్ వేదికలపై సందడి చేయబోయే సినిమాల లిస్ట్ తో పాటు థియేటర్స్ లో ఏయే సినిమాలు రాబోతున్నాయో చూద్దాం..
ఈవారం థియేటర్లో రాబోతున్న సినిమాలు:
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరీ జంటగా నటించిన చిత్రం సమ్మతమే. ఇటీవల విడుదలై ఈ చిత్ర టీజర్, ట్రైలర్ అందరిని ఆకట్టుకున్నాయి. గోపినాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యుజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జూన్ 24న ఈ చిత్రంలో థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ వారం విడుదల కానున్న మరో చిత్రం ‘చోర్ బజార్’. ఆకాష్ పూరీ, గెహనా సిప్పీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీవన్ రెడ్డి తెరకెక్కించారు. వి. ఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న విడుదల కాబోతుంది. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘7డేస్ 6నైట్స్’ . జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఎం.ఎస్. రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కూడా హీరోగా నటించాడు.
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్, ఆశీమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఈ సినిమాకు వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘వలయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన లక్ష చందలవాడ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం జూన్ 24న ఈ మూవీ విడుదల కాబోతోంది. “శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్” బ్యానర్ పై పిఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందిన చిత్రం “షికారు”. సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి నటించిన ఈ చిత్రం జూన్24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. ఈచిత్రంలో త్రిగుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలు పోషించారు. “శ్రేష్ట పటేల్ మూవీస్” బ్యానర్ పై కొండా సుష్మితా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. అపర్ణ మల్లాది దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. ఈచిత్రంలో ప్రిన్స్, అనీషా ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాల విషయానికి వస్తే.. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సొంత చేసుకుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా, జూన్ 23వ తేదీ నుంచి ఆ అద్దె కూడా చెల్లించకుండా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లు ఉచితంగా ఈ సినిమాను చూడోచ్చు.
నెట్ ఫ్లిక్స్:
లవ్ అండ్ గెలాటో(హాలీవుడ్) -జూన్ 22
కుట్టవుమ్ శిక్షాయుమ్(మలయాళం)-జూన్ 24
డిస్నీ + హాట్ స్టార్:
డాక్టర్ స్ట్రేంజ్( తెలుగు) జూన్22
సోనీలివ్:
నెంజుకు నీది(తమిళ)-జూన్ 23
అవరోధ్(హిందీ సిరీస్)-జూన్ 24
ఆహా:
మన్మథ లీల(తెలుగు)- జూన్ 24
వూట్:
దూన్ కాండ్(హిందీ సిరిసీ)- జూన్ 20
జీ5:
ఫొరెన్సిక్(హిందీ)- జూన్ 24
మరి ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.