చిత్ర పరిశ్రమలో ఒక సమయం వచ్చాక విభిన్న కథలవైపు చూస్తుంటారు మన హీరోలు. అందులో భాగంగానే ఆటగాళ్లు, హీరోల బయోగ్రఫీలు వస్తుంటాయి. అయితే తాజాగా హీరో మాధవన్ ఓ ఇస్త్రో శాస్త్రవేత్త జీవిత ఆధారంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’.ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
చెలి, సఖి చిత్రాలతో హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఓ రొమాంటిక్ హీరోగా నిలిచిపోయాడు. అలాగే మరి కొన్ని థ్రిల్లర్ మూవీస్ తో సైతం మనల్ని భయపెట్టాడు. తాజాగా మాధవన్ ప్రఖ్యత ఇస్త్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాకెట్రీ అనే మూవీని తెరకెక్కించారు. జులై1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లు కొల్లగొట్టిందని సినీ విశ్లేషకుల అంచనా.
తాజాగా ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ఫ్రైమ్ వేదికగా జులై 26 నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ప్రత్యేక పోస్టర్ ను సైతం విడుదల చేసింది ఆ సంస్థ. ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబి నారాయణ్ గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ రాకెట్రీ.. ది నంబీ ఎఫెక్ట అనే చిత్రం. ఈ చిత్రంలో హీరో సూర్య, బాలీవుడు బాదా షా షారుఖ్ ఖాన్ లు అతిథి పాత్రలో మెరిశారు. మరి ఈ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.