ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆస్కార్ అవార్డుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు.. ఈసారి భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేకం కాబోతున్నాయి. ఆస్కార్ హడావిడి బాగానే ఉంది. మరి చూడాల్సిన వారి సంగతేంటీ? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆస్కార్స్ ఓటిటిలో ప్రసారం కాబోతున్నాయి. మరి.. ఓటిటి సబ్ స్క్రిప్షన్ లేనివారి పరిస్థితి ఏంటి? అని అంటున్నారు. అలాంటి వారు..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆస్కార్ 2023 అవార్డుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు.. ఈసారి భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఇండియా నుండి ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్, ఆల్ డట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విస్ఫర్స్.. నామినేట్ అయ్యాయి. వీటి రిజల్ట్ కోసం భారతీయులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ 95వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరగనున్నాయి. ఆల్రెడీ ఆస్కార్ వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సోషల్ మీడియాలో అప్ డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది.
ఈసారి ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఖచ్చితంగా అవార్డు కొట్టి తీరుతుందని ఇండియన్స్ ఆశలతో వెయిట్ చేస్తున్నారు. కాగా.. ఆస్కార్ హడావిడి బాగానే ఉంది. మరి చూడాల్సిన వారి సంగతేంటీ? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆస్కార్ వేడుకలు ఓటిటి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో లైవ్ ప్రసారం కాబోతున్నాయి. సో.. హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు అందులో చూస్తారు. ఆస్కార్ హాట్ స్టార్ లో మాత్రమే కాకుండా వేరే ఓటిటిలు కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి. అయితే.. ఓటిటి సబ్ స్క్రిప్షన్ అందరికీ ఉండాలిగా.. అవి లేనివారి పరిస్థితి ఏంటి? అని అడుగుతున్నారు. సో.. ఓటిటి సబ్ స్క్రిప్షన్ లేనివారు అసలు చింతించే అవసరం లేదు.
ఎందుకంటే.. మీ ఇంట్లో కూర్చొని.. మీ ఫేవరేట్ టీవీ ఛానల్స్ లోనే ఆస్కార్ అవార్డుల లైవ్ చూడవచ్చు. ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నీ ఆస్కార్ ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇంతకీ ఏయే ఛానల్స్ లో ఆస్కార్ ప్రసారం కానుందో తెలుసా! ఏవేవంటే.. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ ప్రీమియర్ హెచ్‌డీ, స్టార్ వన్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ ఉత్సవ్, ఫాక్స్, ఫాక్స్ క్రైం, ఎఫ్, విజయ్ టీవీ ఛానల్స్ లో ఆస్కార్ ఈవెంట్ ను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేనివారు ఈ విధంగా టీవీ చానెల్స్ లో చూసేయొచ్చు. ఇక భారత కాలమాన ప్రకారం.. సోమవారం ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ ఈవెంట్ ప్రసారం కాబోతుంది. సో.. ఆస్కార్ లైవ్ చూడాలనుకునే వారు ఈ ఛానల్స్ లో చూసి ఆనందించండి.
The Oscars 2023 will be live-streamed on Hulu Live TV, YouTube @ABCNewsLive , AT&T TV and FuboTV. For Indian viewers, it will be live-streamed on #Disney+Hotstar on Monday 5:30 am #RRRForOscars #Oscars2023 #Oscars95 #NaatuNaatuForOscar #RamCharan pic.twitter.com/x4RJqxpsAH
— Mr.RK (@RavikumarJSP) March 12, 2023