తెలుగు చిత్రసీమ చాలారోజుల తర్వాత ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది. బాక్సాఫీస్ గల్లాపెట్టె ఇంకా గలగల సౌండ్ చేస్తూనే ఉంది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. చాలారోజుల సంక్రాంతి బరిలో నిలిచిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు.. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ కొట్టేశారు. ఫ్యాన్స్ అయితే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చూసి అసలైన పండగ చేసుకున్నారు. ఇక తొలి మూడు నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ సులభంగా క్రాస్ చేసిన ఈ రెండు మూవీస్ కూడా.. వారం తర్వాత బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరి తొలివారం ఏ సినిమా ఎన్నెన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ వింటేజ్ లుక్, మాస్ అవతార్ లో కనిపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. కమర్షియల్ ఎంటర్ టైనర్, బ్రదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ సినిమా.. రిలీజైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ.108 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. మరోవైపు బాలయ్యని ఫుల్ యాక్షన్ అవతార్ లో ఆవిష్కరించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య.. తన మార్క్ ఫైట్స్ తో అల్లాడించారు. ఇక అభిమానుల ఆనందానికైతే హద్దుల్లేకుండా పోయింది. ఈ మూవీ కూడా తొలి నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల గ్రాస్ సాధించిందని నిర్మాణ సంస్థ స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కి సంబంధించిన రిపోర్ట్ వచ్చేసింది. ఏ సినిమా ఎన్నెన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రా-తెలంగాణ 7 రోజుల కలెక్షన్స్ – రూ 79.86 కోట్ల షేర్ (రూ 129.10 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ 7 రోజుల వసూళ్లు: రూ 96.46 కోట్ల షేర్ (రూ 165.45 కోట్లు గ్రాస్) అని సమాచారం.
ఆంధ్రా-తెలంగాణ 7 రోజుల కలెక్షన్స్ – రూ 58.51 కోట్ల షేర్ (రూ 94.65 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ 7 రోజుల వసూళ్లు: రూ 68.51 కోట్ల షేర్ (రూ 114.95 కోట్లు గ్రాస్) అని సమాచారం.