సినిమా ఇండస్ట్రీ అనగానే గ్లామరస్ హీరోయిన్స్.. హౌస్ ఫుల్ బోర్డులు.. కోట్లకు కోట్లు కలెక్షన్స్.. ఇవే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే గత కొన్నేళ్ల నుంచి భారత సినీ పరిశ్రమ రోజురోజుకి తన రేంజ్ పెంచుకుంటూనే వచ్చింది తప్పితే అస్సలు తగ్గలేదు. బాలీవుడ్ లో వచ్చేవి మాత్రమే సినిమాలు అనుకునే వాళ్లు కాస్త సౌత్ నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చేసరికి షాకుల మీద షాకులు తిన్నారు. ‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా మూవీస్ హవా.. ప్రస్తుతం ఎవరూ అందుకోనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇక కలెక్షన్స్ కూడా అందుకు తగ్గట్లే వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇక విషయానికొస్తే.. టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా రూ.100 కోట్లు సాధిస్తే చాలా గొప్పగా చూసేవాళ్లు. కానీ ‘బాహుబలి’ రెండు మూవీస్.. ఏకంగా వందల, వేల కోట్ల రూపాయలు సాధించేసరికి బాక్సాఫీస్ రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత కాలంలోనూ ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 1& 2’, ‘కాంతార’ సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసి, నిర్మాతలకు కూడా నమ్మకాన్ని పెంచింది. దీంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చిత్రాలు తీస్తూ వస్తున్నారు. అలా గతేడాది తెరకెక్కించిన సినిమా పలు సినిమాలు.. 2023 జనవరిలో ప్రేక్షకుల్ని పలకరించాయి. వాటి వసూళ్లు చూసి ఒక్కొక్కళ్లకు దిమ్మతిరిగినంత పనైంది.
టాలీవుడ్ నుంచే మొదలుపెడితే.. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరు ‘వాల్తేరు వీరయ్య’.. రెండూ కూడా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాయి. మరోవైపు తమిళ డబ్బింగ్ చిత్రాలైన విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’ కూడా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక లేటెస్ట్ గా థియేటర్లలో సెన్సేషనల్ వసూళ్లు సాధిస్తున్న షారుక్ ‘పఠాన్’.. కింగ్ ఈజ్ బ్యాక్ అనే రేంజులో కోట్లు కొల్లగొడుతూ దూసుకెళ్తోంది. అలా ఈ జనవరిలో టాప్-5 గ్రాస్ వసూళ్లు సాధించిన మన మూవీస్ చూస్తే.. పఠాన్- రూ 640 కోట్లు, వారిసు- రూ 290 కోట్లు, వాల్తేరు వీరయ్య – రూ 230 కోట్లు, తెగింపు – రూ 190 కోట్లు, వీరసింహారెడ్డి – రూ 130 కోట్లతో ఉన్నాయి. కోట్లకు కోట్లు ఉన్న ఈ నంబర్స్ అన్నీ చూస్తుంటే.. ఒక్క నెలకే ఈ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయంటే.. ఇక ఏడాదంతా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని డౌట్ వచ్చేస్తుంది. మరి ఈ వసూళ్లు చూడగానే మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Top grossing Indian Movies – January 2023#Pathaan #Varisu #WaltairVeerayya #Thunivu #VeeraSimhaReddy pic.twitter.com/2hItWk7mDc
— Filmy Focus (@FilmyFocus) February 1, 2023