బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఛత్రపతి సినిమా చేస్తూ ఎంట్రీని రెడీ అయిపోయాడు. తాజాగా ఆ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది.
బెల్లంకొండ శ్రీనివాస్ కి టాలీవుడ్ లో సరైన హిట్ పడి చాలాకాలం అయ్యింది. అయితే ఇప్పుడు బెల్లంకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో రాజమౌళి- ప్రభాస్ కాంబో ఛత్రపతి మూవీని బెల్లకొండ శ్రీనివాస్ తో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా పెన్ మూవీస్ సంస్థ టీజర్ ని రిలీజ్ చేసింది. ఛత్రపతిలో ప్రభాస్ ని చూసిన తర్వాత ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అదే రేంజ్ లో ఉండాలని అభిమానులు కచ్చితంగా కోరుకుంటారు. అయితే ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న వీవీ వినాయక్ సినిమాని గట్టిగానే ప్లాన్ చేశారు. మరి.. టీజర్ ఎలా ఉందో చూద్దాం.
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ అనగానే కొందరు ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత కచ్చితంగా శ్రీనివాస్ ని మెచ్చుకోకుకండా ఉండలేరు. ఎందుకంటే అప్పియరెన్స్ పరంగా శ్రీనివాస్.. ఛత్రపతిలో ప్రభాస్ కి ఏ మాత్రం తీసిపోలేదు. మేకోవర్.. యాక్టింగ్ విషయంలో వీవీ వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకున్న విషయం చూడగానే తెలిసిపోతుంది. దాదాపుగా సీన్లు, డైలాగులు ఒకేలా ఉన్నాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాలీవుడ్ వాళ్లకి నచ్చేలా కాస్త డోస్ పెంచారనే చెప్పాలి. మాతృకకు కచ్చితంగా టేకింగ్ లో మార్పులు చేశారని తెలిసిపోతోంది. మే 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఛత్రపతి టీజర్ మీక ఎలా అనిపించిందో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.