బిగ్ బాస్.. అనేది పేరుకి మాత్రమే రియాలిటీ షో. ఆ షోలో మనం మనలా ఉండటం చాలా కష్టం. షోలోకి వెళ్తే రియల్ క్యారెక్టర్స్ బయట పడటమేమో గాని.. అసలు క్యారెక్టర్ లేకుండా ఈ రియాలిటీ షో చేస్తుందని టాక్ నడుస్తుంది. ఈ బిగ్ బాస్ షో సీజన్ 1 నుండి సీజన్ 5 వరకూ ఎడిటింగ్ లో నెగటివ్ అయిన బాధితులు చాలామంది ఉన్నారు. ఎడిటింగ్ లో మంచి వాళ్లని చెడుగా.. చెడ్డవాళ్లని మంచిగా చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. అలా బిగ్ బాస్ కారణంగా బాధించబడిన వారిలో హీరోయిన్, నటుడు వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు ఒకరు.
బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి హౌస్ లో అడుగుపెట్టిన వితికా.. దాదాపు 13 వారాలు పాటు హౌస్‌లో కొనసాగి టాప్ 7లో ఒకరిగా నిలిచింది. అయితే ఆమె హౌస్‌లో ఉండగానే భారీ ట్రోల్స్ కి గురైంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తనపై వచ్చిన కామెంట్లు చూసిన వితికా ఎమోషనల్ అయిపోయింది. అసలు అక్కడ జరిగేది ఏంటి? మనకు చూపిస్తున్నది ఏంటి? తాను ఎంతలా వేధించబడింది? అనే విషయాన్ని వీడియో రుపంలో బయటపడింది. చాలా మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షో ద్వారా నష్టపోయినా బయటికి చెప్పలేదు. కానీ వితికా మాత్రం ధైర్యం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది.
అయితే ఈ విషయం పై వితికా భర్త వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘నేను వితికాని చాలా గౌరవిస్తాను. హౌస్ నుండి బయటకు వచ్చాక వితికా బాధపడింది. తనని ఎడిటింగ్ లో తనని నెగటివ్ చేశారని ఏడ్చింది. అది రియాలిటీ షో కాబట్టి డే అంతా చూపించలేదు. కానీ ఓ గంట ప్రోగ్రాం చూసి ప్రేక్షకులు ఎలా బూతులు తిడతారో నాకు అర్ధం కాలేదు. ఆ విషయంలోనే నా భార్య గురించి నేను బాగా ఫీల్ అయ్యాను. అయినా.. ఓ గంట ప్రోగ్రాం చూసి మనిషి క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారు? నా భార్య సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. మా ఇద్దరిలో ఒకరు ఎక్కువ అనే ఫీలింగ్ ఉండదు. ఎల్లప్పుడూ మేమిద్దరం ఒకటే’ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్.