Vishwak Sen: మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విశ్వక్‌సేన్. ఈ నగరానికి ఏమైంది, హిట్, పాగల్ సినిమాలతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ సెలెబ్రిటీలతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా నటి గీతూ రాయల్ ‘‘ కేరీర్ ప్రారంభించిన నాటినుంచి ప్రతీ సినిమాలో మీకొక బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు చూపించారు. రియల్ లైఫ్‌లో ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా?’’ అని అడిగింది.
దీనికి విశ్వక్ సేన్ సమాధానం ఇస్తూ.. ‘‘ ప్రతి ఒక మగాడి లైఫ్‌లో ఏదో ఒక సమయంలో ఇలాంటి కథలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ ట్రాజెడీకి గురవుతారు. ఎస్కేప్ కాలేని ప్రాబ్లమ్ అది. నాకొక బ్రేకప్ స్టోరీ ఉంది. మూడేళ్ల పాటు ఓ అమ్మాయిని ప్రేమించాను. చాలా సిన్సియర్‌గా ప్రేమించా. ఎందుకో తెలీదు. ఆమె నన్ను వదిలేసింది. ఈ విషయం నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. ఇంతకు మించి ఆమె గురించి ఏమీ చెప్పలేను. ఇప్పటికీ బాధగానే ఉంది’’ అని అన్నారు. మరి, విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Young Director: కరెంట్ షాక్‌తో యంగ్ డైరెక్టర్ మృతి!