Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ దేవీ నాగవల్లి వివాదం అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్ తనపై పరుషపదజాలం ఉపయోగించారంటూ దేవీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. విశ్వక్ సేన్‌పై సినిమా పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం వేదికగా జరిగిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు నా సినిమా కష్టాల గురించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లో హీరో అవుతాను అని చెబితే ఇంట్లో వాళ్లు ఆశ్చర్యంగా చూస్తారు. కానీ, నన్ను మాత్రం మా అమ్మ నమ్మింది.
ఏదైనా హిట్ సినిమా వస్తే.. నువ్వెప్పుడు హీరో అవుతావురా అని అడిగేది. ఆ తర్వాత మా నాన్న నమ్మాడు. ఎంతో కష్టపడి ఫిల్మ్ కోర్సు చేశాను. డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాను. 12 లక్షలు పెట్టి ‘వెళ్లిపోమాకే చేశాను’.. ఆ సినిమా నిర్మాతకు నచ్చి దాన్ని కొని రిలీజ్ చేశాడు. అదే పెద్ద సక్సెస్.. నా దగ్గర ఏం లేని సమయంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీశాడు. ఆయనకు థ్యాంక్స్. ఆ తరువాత ‘‘ఫలక్ నుమా దాస్’’ నేను తీసుకున్నా. మీడియా నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చింది. సినిమా తీస్తే, అది నచ్చితే.. ఇంత బాగా ఆదరిస్తారా? ఇలాంటి స్థానం ఇస్తారా? అని నిరూపించింది ఆ సినిమా. ఇక ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటయ్ రా అని అనుకున్నా.. ఎదుగుదల అంటే.. ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు దాక్కోవటం కాదు.. నన్ను ఎవరో అన్నారని, వేలెత్తి చూపించారని నాకు బాధలేదు.
నాక్కూడా ఫ్యామిలీ ఉంటుందని కూడా ఆలోచించకుండా కొన్ని చేస్తుంటారు. అమ్మా నీకు ఒకటే చెబుతున్నా.. నీ కొడుక్కి ఏం కాదు.. ఎవడూ ఏం పీకలేడు. నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వనని అంటున్నారు. అదే నిజమైతే! ఆ రోజు స్టూడియోలోనుంచి ఊరికే బయటకు వచ్చే వాడిని కాదు. నీ కొడుక్కి నువ్ నేర్పిన సంస్కారం అందరికీ తెలుసు. నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు.. చిన్న ఈగలాంటివాడిని. నలుగురు కలిపి కొడితే పడిపోతాను. కానీ, నాకు రక్షణగా అభిమానులు ఉన్నారు. నిన్న నా సోషల్‌మీడియా ఖాతాలో నాకు సపోర్టుగా ఫ్యాన్స్ పెట్టిన మెసెజ్‌లు చూశాను. మీరే నా ఆస్తి.. నన్ను ఎవ్వరూ ఏం పీకలేరని అనిపించింది.. నాకు మీరున్నారు’’ అని అన్నారు. అనంతరం మోకాళ్లపై కూర్చుని ఫ్యాన్స్ అనే వాళ్ల లేకపోతే తన స్థానంలో వేరే వాళ్లు ఉండి ఉంటే ఏదైనా చేసుకుని ఉండేవాళ్లని, ఫ్యాన్స్ తనకు ధైర్యం ఇచ్చారని అన్నారు. మరి, విశ్వక్ సేన్ ఎమోషన్ స్పీచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహేష్ బాబు డ్యాన్సింగ్ స్కిల్స్ పై శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్..!