సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్.
ఇండస్ట్రీలో ఓ మాస్ కాంబినేషన్ పడితే.. బాక్సాఫీస్ లు షేక్ కావాల్సిందే. అలాంటి మాస్ కాంబినేషన్ లు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఓ కాంబినేషన్ రాబోతోంది అన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే? టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు అని. మాస్ హీరోలను అంతకంటే మాస్ రేంజ్ లో చూపించడంలో దిట్ట పూరీ జగన్నాథ్. అలాంటి డైరెక్టర్ చేతిలో మాస్ కా దాస్ విశ్వక్ పడితే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందా? ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ్.. లైగర్ అనే ఒకే ఒక్క సినిమాతో తన సినీ కెరీర్ మెుత్తం ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్లిపోయింది. అయితే పూరీకి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగాడు పూరీ. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ పూరీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అని. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. విశ్వక్ మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
మరి ఇలాంటి టైమ్ లో పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తాడా విశ్వక్? ఇక ఈ న్యూస్ ఆ నోటా.. ఈ నోటా పడి విశ్వక్ కు చేరింది. దాంతో అతడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేయట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అటు పూరీ టీమ్ సైతం ఇది గాసిప్ మాత్రమే అని తేల్చి చెప్పింది. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ లు బద్దలు కావడం ఖాయం అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి విశ్వక్ పూరీ డైరెక్షన్ లో సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.