‘అశోక వనంలో అర్జున కల్యాణం‘ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఓ ప్రాంక్ వీడియో ఓ పెద్ద దుమారమే రేపింది. ఈ ప్రాంక్ వీడియోపై ఓ ప్రముఖ మీడియా ఛానల్ డిబేట్ నిర్వహించడం.. ఆ డిబేట్ లో యాంకర్ దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ ను ‘పాగల్ సేన్‘ అని కూడా అంటారంట అని ప్రస్తావించడం మరింత అగ్గి రాజేసింది. ఆ వ్యాఖ్యలు చూసిన విశ్వక్ నేరుగా ఛానల్ కు వెళ్లి డిబేట్ లో పాల్గొని పాగల్ సేన్ అని పిలివడం ఏంటని అసహనం వ్యక్తం చేయడం కూడా మనం చూశాం. ఈ క్రమంలో యాంకర్ దేవీ నాగవల్లి గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ ఫైర్ అవ్వడం.. వెళ్లే క్రమంలో విశ్వక్ ఒక అభ్యంతరకర పదాన్ని ఉపయోగించడం.. ఇలా దుమారాన్నే రేపింది. ఈ ఘటనపై అప్పుడు విశ్వక్ సేన్ ఆ భాష వాడటం పట్ల క్షమాపణలు కూడా తెలియజేశాడు. కానీ.. ఈ విషయాన్ని సదరు మీడియా ఛానల్ వదిలేలా లేదు.
ఈ మొత్తం కాంట్రవర్సీపై సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.