ఆర్టిస్టులు, నటులంతా ఏవేవో డ్రీమ్స్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు. వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకున్నాక, వారి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యాక డబ్బుతో కొనగలిగే వాటిని కొనుక్కొని ఆనందిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ డ్రీమ్ నెరవేరిన ఆనందంలో ఉన్నాడు. మాస్ కా దాస్ అంటూ తనలోని మల్టీటాలెంట్ ని బయటపెట్టిన విశ్వక్.. ఆ తర్వాత హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత పాగల్ సినిమా చేసి హిట్స్ కంటిన్యూ చేస్తూ.. తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. మాస్ అంశాలను పక్కన పెట్టి పూర్తి క్లాస్ లుక్కుతో, క్లాస్ యాక్షన్ తో విశ్వక్ సేన్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం విశ్వక్.. అశోకవనంలో అర్జున కళ్యాణం విజయాన్ని ఎంజాయ్ చేస్తూ.. తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్ ‘బెంజ్ జి క్లాస్ 2022’ మోడల్ కారును కొనుగోలు చేశాడు.ఇక తన డ్రీమ్ కారు కొన్న సందర్భంగా విశ్వక్ సేన్ కారుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. “నా డ్రీమ్ కారు కొన్నాను. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల వల్లే ఇదంతా సాధ్యమైంది. నా లైఫ్ లో జరుగుతున్న ప్రతి విషయంలో ఆనందంగా ఉన్నాను. థాంక్యూ” అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే.. విశ్వక్ పోస్ట్ పై యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించి.. ‘ఆ కారు నాదే. ఫోటోలు తీసుకుంటా అంటే ఇచ్చిన’ అని సరదాగా కామెంట్ చేశాడు.
డైరెక్టర్ కామెంట్ కి విశ్వక్ సేన్ రిప్లై ఇస్తూ.. “ఈ నగరానికి ఏమైంది-2′ మూవీ తియ్యి.. కారు వాపస్ ఇస్తా” అని అన్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ – తరుణ్ భాస్కర్ ల సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో తరుణ్ భాస్కర్.. విశ్వక్ సేన్ ని హీరోగా పరిచయం చేస్తూ హిట్ ఇచ్చాడు. అదీగాక ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక విశ్వక్ కొన్న మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ కారు ధర సుమారు కోటిన్నర ఉంటుందని సమాచారం. మరి విశ్వక్ సేన్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.