తెలుగు బుల్లితెరపై ఎంతో మంది స్టార్ ఫీమేల్ యాంకర్స్ ఉన్నారు. వీరిలో హాట్ యాంకర్ విష్ణు ప్రియకి ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఘాటైన అందాలను ఆన్ స్క్రీన్ పై అవలీలగా ఆరబోయడంలో విష్ణు ప్రియ స్టయిలే వేరు. ఇక పోవే పోరా పోగ్రామ్ లో సుధీర్ తో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అమ్మడికి మంచి క్రేజ్ దక్కేలా చేసింది. కానీ.., ఇంత చేసినా విష్ణుప్రియ.. అనసూయ, రష్మీలా బిజీ కాలేకపోతోంది. దీనితో ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చి పోతోంది విష్ణు. అంతే కాదు.., ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేస్తూ.., కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. కానీ.., తాజగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న విష్ణుప్రియని కాస్త ఇరకాటంలోకి నెట్టినా.., తెలివిగా సమాధానం ఇచ్చి శభాష్ అనిపించుకుంది ఈ కుర్ర యాంకరమ్మ.
హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తున్న విష్ణుప్రియ.. ఈ మధ్య అంతే రేంజ్ లో సోషల్ మీడియాలో బిజీగా ఉంటోంది. పైగా.., వరుసగా లైవ్స్ చేస్తూ.., అభిమానులకి టచ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియకి ఓ నెటిజన్ నుండి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. విష్ణు ప్రియ హాట్ ఫోటో షూట్ చూసిన దియా అనే అభిమాని ” మా మొఖాలు చూపించలేక పోతున్నాం, చూడు మీ విష్ణు ప్రియ ఎలాంటి పిక్స్ పెడుతుందో అని కొందరు ఏడిపిస్తునారు! అక్క… కాస్త పద్ధతిగా ఫోటోలు దిగి పెట్టు అంటూ కామెంట్ చేశాడు. దీనికి తడుముకోకుండా విష్ణుప్రియ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. చూడు దియా ఏదైనా ఆనం చూసే దృక్పధాన్ని బట్టి ఉంటుంది. నీ దృక్పధం బాగుంటే రాయిలో కూడా దేవుని చూడొచ్చు. అంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను గ్లామర్ ఫీల్డ్ లో ఉనాన్ను. ఇక్కడ రాణించాలి అనుకుంటున్నాను. నా వృత్తిలో భాగంగా ఇలాంటి బట్టలు వేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఇదేమి తప్పు కాదు. అంత మాత్రాన నేను అలాంటి దాన్ని కాదు. ఇది నీకు అర్థం కాకుంటే.., ఆ శక్తి భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని విష్ణు ప్రియ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది. దీనితో.., విష్ణుప్రియకి మిగతా నెటిజన్స్ నుండి ఓ రేంజ్ లో మద్దతు లభిస్తోంది.