సంయుక్త, విష్ణుకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన 15 రోజుల్లోనే ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ నేపథ్యంలో విష్ణుకాంత్ ఓ ఆడియోను విడుదల చేశాడు.
ప్రముఖ తమిళ నటీ,నటులు సంయుక్త, విష్ణుకాంత్‌లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు 15 రోజుల్లోనే విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారం.. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. దేశ చిత్ర పరిశ్రమలోనే చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు. విష్ణుకాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని క్రిప్టిక్ మెసేజ్‌లను పోస్టు చేశాడు. ‘‘ మౌనం అంటే అర్థం.. ఏమీ లేదని కాదు.. అందులో చాలా నిజాలు, సమాధానాలు ఉన్నాయి. ఎఫైర్లు.. నిజమైన ప్రేమను..
ఫేక్ ప్రేమగా మార్చాయి. ఇక మౌనంగా ఉండేది లేదు’’ అని పేర్కొన్నాడు. దాదాపు 15 రోజుల తర్వాత తన మాజీ భార్య సంయుక్తకు సంబంధించిన ఓ ఆడియో కాల్ రికార్డింగ్‌ను విష్ణు బయటపెట్టాడు. ఆ ఆడియోలో.. సంయుక‍్త తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. సంయుక్త తనకు ఓకే చెప్పిన తర్వాత కూడా మాజీ బాయ్‌ఫ్రెండ్ రవితో ఆమె టచ్‌లో ఉన్నట్లు విష్ణు గుర్తించాడు. ఇదే పెళ్లి తర్వాత అనుమానానికి దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయి. విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సమయంలో విష్ణు ఈ ఆడియోను బయటపెట్టాడు.
ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సంయుక్త, విష్ణులు విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న ‘సిప్పికుల్ ముత్తు’ సీరియల్‌లో కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 15 రోజుల్లోనే విడిపోయారు. మరి, విష్ణు విడుదల చేసిన సంయుక్త ఆడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.