భీమినేని విష్ణుప్రియ.. యూట్యూబర్ గా, యాంకర్ గా, హీరోయిన్ గా తనని తాను ప్రూవ్ చేసుకుంది. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఇటీవల వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ సంగతి పక్కన పెడితే విష్ణు ప్రియకు మాత్రం కెరీర్ లో ప్లస్ అయ్యిందనే చెబుతున్నారు. గతంలో ఉన్న ఫాలోయింగ్ కంటే ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్, క్రేజ్ పెరిగిందనెే చెప్పాలి. గ్లామరస్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న ఈమె ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్ కూడా అనిపించుకుంది.
ప్రస్తుతం విష్ణుప్రియా మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. ఆ వీడియోలో ఇంకో బ్యూటీ కూడా సందడి చేసింది. జబర్దస్త్ లేడీ కమేడియన్ రీతూ చౌదరి కూడా కనిపించింది. ఇద్దరూ కలిసి మలేషియా వెకేషన్ కు చెక్కేశారు. అయితే ఇవి న్యూఇయర్ పార్టీనా? ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. వాళ్లు పోస్ట్ చేసిన వీడియోలో ఇద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
పైగా ఆ వీడియోకి ఈ జీవితం సరిపోదు అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. విష్ణుప్రియ ఇటీవల శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో కవర్ సాంగ్ కూడా చేసింది. అలాగే బుల్లితెర మీద మానస్ నాగులపల్లితో కలిసి ఓ సూపర్ హాట్ వాన పాటకు స్టెప్పులేసింది. ఇంక రీతూ చౌదరి విషయానికి వస్తే.. ఆమె ఓ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తితో ప్రేమలో ఉందని చాలానే వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కూడా కాబోతున్నారని చెప్పుకొచ్చారు. మరి.. ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.