యాంకర్ విష్ణు ప్రియ.. ఒక యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత బుల్లితెర వైపు అడుగులు వేసింది. యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. స్పెషల్ ఈవెంట్స్, షోలు అంటూ చాలా బిజీగా గడిపింది. ప్రస్తుతం ఆర్టిస్టుగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే హీరో సంతోష్‌శోభన్ తో కలిసి బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడు అనే ఫుల్ కామెడీ సినిమాలో నటిస్తోంది. విష్ణుప్రియకు దైవ చింతన కూడా ఎక్కువే.. ఎప్పుడూ ఏదొక మెసేజ్ లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
అయితే విష్ణుప్రియ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు, ఫాలోవర్స్ కు అందుబాటులోనే ఉంటుంది. ఎప్పుడూ ఏదొక పోస్టు పెడుతూ తన అభిమానులను అలరిస్తుంటుంది. అయితే విష్ణుప్రియ చేసే ఎక్కువ పోస్టులు డాన్సింగ్ వీడియోలే ఉంటయాని చెప్పొచ్చు. విష్ణుప్రియ ఎప్పుడూ కాస్త బోల్డ్ ఫొటోస్, డాన్సింగ్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుందని అందరికీ తెలిసిందే.
అలా ఎందుకు చేస్తుందనే అనుమానం రాకపోదు. ఎందుకంటే తను బోల్డ్ క్యారెక్టర్లలో కూడా నటించగలను నాకు ఆ టాలెంట్ ఉందని చెప్పకనే చెప్పేందుకు అలా చేస్తుంటుందని టాక్. తాజాగా బాద్ షా మ్యూజిక్ వీడియో తౌబా అనే ట్రాక్ కు పొట్టి గౌనులో విష్ణుప్రియ డాన్స్ ఇరగదీసింది. విష్ణు ప్రియ వేసిన క్లాసీ స్టెప్పులకు ఫాలోవర్స్, ఫ్యాన్స్ కు ఫీవర్ వచ్చిందనే చెప్పాలి. విష్ణు ప్రియ వైరల్ డాన్సింగ్ వీడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.