పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఎక్కడైనా కామన్. టాటూ అనేది ఎవర్‌గ్రీన్ ట్రెండ్ అనే చెప్పాలి. చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ల పేర్లు, నచ్చిన గుర్తులు, రకరకాల సింబల్స్ లాంటి వాటిని తమ శరీరంపై టాటూగా వేయించుకుంటారు. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేకుండా దాదాపుగా అన్ని చోట్ల ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. మన దేశంలోనూ ఈ కల్చర్ ఉంది. ముఖ్యంగా ఫిల్మ్, స్పోర్ట్ సెలబ్రిటీల్లో ఇది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఓ టాటూతో వార్తల్లో నిలిచారు. దిగ్గజ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెలపై పొడిపించుకున్నాడు విశాల్.
ఎంజీఆర్‌ను విపరీతంగా ఆరాధించే వారిలో విశాల్ ఒకరు. ఆ ఇష్టం, ప్రేమతోనే ఆ ఫొటోను పొడిపించుకున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే, ఈ మధ్య సరైన విజయం లేక విశాల్ కాస్త నెమ్మదించారు.ఈ యాక్షన్ స్టార్ నటించిన గత చిత్రాలు ‘లాఠీ’, ‘ఎనిమీ’ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీస్ పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్న విశాల్.. ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయ్యాక ‘డిటెక్టివ్’ సీక్వెల్‌ను తెరకెక్కించడంలో ఆయన బిజీ అవుతారని తెలుస్తోంది. మరి, ఛాతీ మీద ఎంజీఆర్ ఫొటోను చెక్కించుకున్న విశాల్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Actor Vishal gets a tattoo of Legendary Leader #MGR on his chest @VishalKOfficial is an ardent fan & follower of the former #ChiefMinister of Tamil Nadu pic.twitter.com/FGPUH9VyXx
— Maduri Mattaiah (@madurimadhu1) January 24, 2023