మాస్, యాక్షన్ సినిమాలతో మంచి స్టార్‌డమ్ తెంచుకున్న హీరో విశాల్ సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. పందెం కోడి, డిటెక్టివ్, ఎనిమీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన సినిమాల్లో కష్టతరమైన ఫైట్స్‌ను కూడా డూప్ లేకుండా సొంతంగా చేస్తుంటాడు విశాల్. ఈ క్రమంలోనే లాఠీ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో గాయాలపాలయ్యాడు. గతవారం కూడా లాఠీ సెట్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరాడు.
ఒక వైపు సినీ కెరీర్ అద్భుతంగా ఉన్నా.. గతం కొంత కాలంగా విశాల్ పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. నడిగర్ సంఘం భవనం పూర్తయిన అనంతరమే పెళ్లి చేసుకునే ఆలోచనలో విశాల్ ఉన్నాడు. కానీ, కరోనా, ఆర్థిక కారణాలు, కోర్టు కేసులతో ఆ బిల్డింగ్ పనులు ముందుకు సాగడం లేదు. 2019లో అనీషా అల్లారెడ్డితో ఈ స్టార్ హీరోకు నిశ్చితార్థం అయింది. ఏమైందో తెలియదు కానీ ఆరునెలల అనంతరం నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌తో విశాల్ రిలేషన్‌షిప్ కొనసాగించాడని వార్తలు వచ్చాయి. తాజాగా విశాల్ తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పెద్దలు కుదిర్చిన వివాహం తనకు సరిపోదని తెలిపాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఆమెకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నాడు. మరి విశాల్ జీవితంలోకి వచ్చే ఆ అమ్మాయి ఎవరై ఉంటుందా? అని ఇప్పటికే విశాల్ అభిమానాలు తెగ చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Train like a train. There is no substitute for hard work#TrainHard #BeastMode #StayFit #Laththi #LaththiCharge #Laatti #StayFit pic.twitter.com/Vkhnggy6LU
— Vishal (@VishalKOfficial) July 2, 2022