విరూపాక్ష సినిమా సక్సెస్ కావడంతో.. సంతోషంతో సాయిధరమ్ తేజ్ కు టైట్ హగ్ ఇచ్చింది సంయుక్తా మీనన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా సినిమా హిట్ అయితే చిత్ర యూనిట్ కు ఉండే ఆనందమే వేరు. రాత్రి పగలు కష్టపడి సినిమా కోసం పనిచేస్తారు హీరో, హీరోయిన్, డైరెక్టర్ మిగతా యూనిట్ మెుత్తం. సినిమా హిట్ అయితే.. ఇక వారు పడ్డ కష్టం గురించి పట్టించుకోరు. అలా ఉంటుంది గెలుపు రుచి. మూవీ హిట్ అయ్యిందని తెలియగానే చిత్ర యూనిట్ కేక్ లు కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే భావోద్వేగంతో కూడా కౌగిలింతలు కూడా ఆ వేడుకల్లో చోటు చేసుకుంటాయి. తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో కేట్ కట్ చేసుకుని సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సాయి ధరమ్ తేజ్ కు టైట్ హగ్ ఇచ్చింది హీరోయిన్ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’ ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది. దాంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు చిత్ర యూనిట్. ఓ థియేటర్లో సినిమా చూసి బయటికి వచ్చిన సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లు కలిసి కేట్ కట్ చేశారు. అభిమానుల కేరింతలు, డప్పు సప్పుల్లతో థియేటర్ ప్రాంగణం మెుత్తం హోరెత్తింది.
ఇక కేట్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్న తర్వాత హీరోయిన్ సంయుక్తా మీనన్.. సాయిధరమ్ తేజ్ కు టైట్ హగ్ ఇచ్చింది. హిట్ ఇచ్చిన కిక్ తో తన సంతోషాన్ని ఇలా తెలియజేసింది అమ్మడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో సీతారామం సినిమా హిట్ అవ్వగానే డైరెక్టర్ కు కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది మృణాల్ ఠాకూర్. ఇప్పుడు సంయుక్తా తన సంతోషాన్ని హాగ్ ఇవ్వడం ద్వారా తెలియజేసింది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ లో విరూపాక్ష తెరకెక్కికంది. సుక్కు శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని అద్భతంగా తెరకెక్కించాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ కు చాలా రోజుల తర్వాత ఓ డీసెంట్ హిట్ దక్కింది అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.