ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన చిత్రాల్లో ఆడియెన్స్‌తోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన మూవీగా ‘విరూపాక్ష’ను చెప్పొచ్చు. థియేటర్లలో సూపర్బ్ రన్‌ను కొనసాగించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాన్నాళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి తేజ్ నటించిన మూవీ ‘విరూపాక్ష’. యువ దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఊహించిన దాని కంటే బిగ్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన ‘విరూపాక్ష’కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యింది. దీనికి తోడు ఆ తర్వాత విడుదలైన చిత్రాలన్నీ బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్ బాట పట్టడంతో బాక్సాఫీస్ దగ్గర ‘విరూపాక్ష’కు అడ్డే లేకుండా పోయింది. రీసెంట్గా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మొదటి రూ.100 కోట్ల మూవీగా ‘విరూపాక్ష’ నిలిచింది. అలాంటి ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరదించుతూ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది ‘విరూపాక్ష’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో శనివారం రాత్రి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, ‘విరూపాక్ష’ కథ విషయానికొస్తే.. 1979 కాలంలో రుద్రవనం అనే మారుమూల గ్రామంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు.. ఆ ఊరి కట్టుబాట్లు, పద్ధతులను మార్చేస్తాయి. అది జరిగిన కొన్నేళ్లకు సాయి తేజ్ తన తల్లితో కలసి ఆ ఊరికి వస్తాడు. అక్కడ సంయుక్త మీనన్‌తో ప్రేమలో పడతాడు. పీడశక్తి వల్ల అల్లకల్లోలమవుతున్న ఆ ఊరును సాయి తేజ్ ఎలా కాపాడాడనేది మిగిలిన స్టోరీ.
#Virupaksha – Netflix – From 12 AM IST pic.twitter.com/J3Id6iOy3u
— Aakashavaani (@TheAakashavaani) May 20, 2023