ప్రేక్షకుల్ని భయపెడుతూనే థ్రిల్ చేస్తున్న 'విరూపాక్ష'.. కలెక్షన్స్ కూడా అదే రేంజులో సాధిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి విషయం?
సినిమాలో దమ్ముంటే.. ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. మౌత్ టాక్ బలంగా వస్తుంది. ఆటోమేటిక్ గా హిట్ అయిపోతుంది. కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చిపడతాయి. తాజాగా అలాంటి ఫీట్ సాధించిన మూవీ ‘విరూపాక్ష’. ట్రైలర్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ లేదు. అయితేనేం హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తోంది. ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా?
అసలు విషయానికొస్తే.. తెలుగులో చాలారోజుల తర్వాత వచ్చిన ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీ ‘విరూపాక్ష’. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ కు హారర్ ఎలిమెంట్స్ జోడించినప్పటికీ.. లాజిక్స్ ఏం మిస్ కాకుండా చూసుకున్నారు. స్క్రీన్ ప్లే అందించిన సుకుమార్.. ట్విస్టులతో నెక్స్ట్ లెవల్ థ్రిల్ అందించారు. దీంతో ఆడియెన్స్ ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయారు. ఈ క్రమంలోనే పాజిటివ్ టాక్ వచ్చేసింది. థియేటర్లకు వెళ్లే వాళ్లు కూడా రోజురోజుకి పెరుగుతున్నారు. ఇలా హీరో సాయిధరమ్ తేజ్ కి ‘విరూపాక్ష’ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాదు.. నెవ్వర్ బిఫోర్ కలెక్షన్స్ తో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది.
సాయిధరమ్ తేజ్, సంయుక్తా మేనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘విరూపాక్ష’కి తొలిరోజు రూ. 12 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు ఆ నంబర్ ఇంకాస్త పెరిగింది. వీకెండ్ కావడంతో శనివారం ఏకంగా రూ.16 కోట్ల వరకు వచ్చాయి. దీంతో రెండు రోజుల మొత్తం వసూళ్లు రూ.28 కోట్లకు పైగా వచ్చాయని స్వయంగా నిర్మాణ సంస్థనే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో మెగాఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ‘విరూపాక్ష’కి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మీకేం అనిపిస్తోంది. కింద కామెంట్ చేయండి.
Supreme Hero @IamSaiDharamTej sets off a Box-office Blast with Spine-Chilling Thriller #Virupaksha grossing 28CR on Day 2 much bigger than Day 1 🥳🤩
Book your tickets #BlockbusterVirupaksha👇https://t.co/HzG8SAAGh7@iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/dqEJ7HJEwm
— SVCC (@SVCCofficial) April 23, 2023